Virupaksha Teaser: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తరువాత మొట్ట మొదటిసారి వెండితెర మీద విరూపాక్ష సినిమాతో సందడి చేయడానికి సిద్దమయ్యాడు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బివిఎస్ ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తేజ్ సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదటి నుంచి ఈ సినిమా చేతబడులు నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు తెలిపి ఆసక్తిని పెంచేశారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన టీజర్ లో కూడా అదే చూపించి ఒక్కసారిగా భయపెట్టేశారు.
Icon Star: ఇన్ స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ అరుదైన రికార్డ్!
టీజర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. చరిత్ర లో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి అంటూ సాయి చంద్ బేస్ వాయిస్ తో టీజర్ మొదలయ్యింది. అడవిలో ఒక గ్రామం.. ఆ గ్రామంలో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉండడం.. వాటిని చూసి ప్రజలు బెంబేలెత్తిపోవడం కనిపిస్తుంది. ఇక ఆ సమస్య కు పరిష్కారం విరూపాక్ష అని చెప్పకనే చెప్పేశాడు దర్శకుడు. ఆ గ్రామంలో ఉన్న మనుషులకు ఏదో దెయ్యం పట్టినట్లు ప్రవర్తిస్తుంటారు. వారిపై చేతబడులు జరుగడం, ఆ తరువాత ఒక్కొక్కరిగా వారు చనిపోవడం జరుగుతూ ఉంటాయి. అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి విరూపాక్ష ప్రయత్నిస్తున్నట్లు చూపించారు. సమస్య ఎక్కడ మొదలయ్యిందో పరిష్కారం అక్కడే వెతకాలి అని తేజ్ డైలాగ్ తో అతడే ఆ సమస్యకు పరిష్కారం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ పరిష్కారం కోసం తేజ్ చేసిన సాహసం ఏంటి.? అసలు వీటన్నింటికి కారణం ఎవరు..? అనేది తేజ్ తెలుసుకున్నాడా..? చివరికి ఆ ఊర్లో చేతబడులు చేసేది ఎవరు..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. టీజర్ లో మెయిన్ కాన్సెప్ట్ ను మాత్రం హైడ్ చేసి ఇంకా ఆసక్తిని కలిగించారు. చివరిలో ఒక మహిళ.. బావిలో దూకుతున్న షాట్ అయితే టీజర్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది. ఇక కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అంజనీష్ లోక్ నాథ్ మరోసారి తన నేపధ్య సంగీతంతో మెస్మరైజ్ చేశాడు. ఇక విజువల్స్ అయితే అదిరిపోయాయి. మొత్తానికి టీజర్ తోనే తేజ్ సగం మార్కులు కొట్టేశాడని చెప్పాలి. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా ఏప్రిల్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో మెగా మేనల్లుడు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.