సాయిధరమ్ తేజ్ వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న సమయంలో ‘విరూపాక్ష’ అనే సినిమాను చేశాడు. హర్రర్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలతో ఎంతో గ్రాండ్ గా విడుదల అయింది.కార్తీక్ దండు ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల మరియు అజయ్ ముఖ్య పాత్రలు పోషించారు.ఈ సినిమాకు అంజనీష్ లోక్‌నాథ్ అదిరిపోయే మ్యూజిక్ ను ఇచ్చారు. థ్రిల్లింగ్ హారర్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ దక్కాయి. ఇలా ఈ చిత్రం నెమ్మదిగా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
ఈ సినిమా ఫుల్ రన్‌లో అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 49 కోట్లు వరకూ షేర్‌తో పాటు రూ. 100 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా నిర్మాతలకు దాదాపు రూ. 25 కోట్లు వరకూ లాభాలు వచ్చాయి. ఇక, ఓటీటీలో కూడా ఈ చిత్రం అదిరిపోయే రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఓటీటీలో చాలా రోజుల పాటు అలరించిన ‘విరూపాక్ష’ మూవీ.. ఇటీవలే స్టార్ మా ఛానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం అయింది..బుల్లి తెరపై కూడా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి ఏకంగా 11.68 టీఆర్పీ రేటింగ్ లభించింది.. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు నటించిన చిత్రాలు కూడా ఇంత ఎక్కువగా రేటింగ్‌ను సాధించ లేకపోయాయి.. ఓటీటీ ల ప్రభావం వున్నా కూడా ఈ సినిమా భారీ స్థాయిలో టీఆర్పి రేటింగ్ సాధించింది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో ది అవతార్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 28వ తేదీన గ్రాండ్ గా విడుదల కానుంది.