Emergency Landing: ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. చిక్కుకున్న 200 మంది భారతీయులు
- లండన్ నుంచి ముంబయికి బయలుదేరిన విమానం
- మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా టర్కీలో అత్యవసరంగా ల్యాండ్
- ఫ్లైట్ లో 200 మందికిపైగా భారతీయ ప్రయాణికులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Emergency Landing: లండన్ నుంచి ముంబయికి బయలుదేరిన ఒక విమానం మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా టర్కీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనతో టర్కీలోని దియార్‌బకిర్ ఎయిర్‌పోర్టులో బుధవారం రాత్రి నుంచి 200 మందికిపైగా భారతీయ ప్రయాణికులు చిక్కుకుపోయారు. వర్జిన్ అట్లాంటిక్ విమానం లండన్ నుండి ముంబయి ప్రయాణానికి బయలుదేరింది. అయితే, సాంకేతిక సమస్య కారణంగా, దియార్ బకిర్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read Also: Hanu- Prabhas: హనుతో ప్రభాస్ మరో సినిమా?
Also Read
అయితే సమాచారం మేరకు ల్యాండింగ్ సమయంలో కొన్ని సాంకేతిక సమస్యలు చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ కారణంగా ప్రయాణికులకు విమానాశ్రయం నుండి బయటకు వెళ్లే అనుమతులు ఇవ్వలేదు. దీంతో దాదాపు 20 గంటలుగా ప్రయాణికులు అక్కడే ఉన్నారు. విమానంలో 200 మందికి పైగా భారతీయులు ఉన్నారని, వారు ఎప్పటికి ముంబయికి చేరుకుంటారో అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. విమానయాన సంస్థ నుండి ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన ఇంకా అందలేదు.
ప్రస్తుతానికి తగిన సౌకర్యాలు కూడా లేకుండా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఆ విమానాశ్రయం మిలిటరీ బేస్ ప్రాంతంలో ఉండటంతో వారు బయలుదేరడం కుదరటంలేదని సమాచారం. ఇక సంబంధిత అధికారులకు గమ్యస్థానానికి వీలైనంత త్వరగా ప్రయాణ ఏర్పాట్లను చేయాలని ప్రయాణికులు కోరారు.
తాజావార్తలు
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!