భారత క్రికెటర్ స్టార్ విరాట్ కోహ్లీ కేవలం గ్రౌండ్ లోనే కాకుండా వ్యాపార రంగంలోనూ తనదైన శైలిలో దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు దుస్తులు, రెస్టారెంట్ల బిజినెస్లను ఆయన నిర్వహిస్తున్న విషయం మనకి తెలిసిందే. రెస్టారెంట్లను విరాట్ కోహ్లీ ‘వన్ 8 కమ్యూన్’ పేరుతో రెస్టారెంట్లు బిజినెస్ చేస్తున్నారు. వీటికి సంబంధించి బెంగళూరు, ముంబై, పుణె, కోల్‌కతా, ఢిల్లీ నగరాలలో ఈ రెస్టారెంట్లను ఏర్పాటు చేసాడు విరాట్ కోహ్లీ.
Asaduddian Owaisi: ఓటింగ్ అడ్డుకోవడానికి బీజేపీ ముస్లిం మహిళల్ని బీజేపీ టార్గెట్ చేస్తోంది..
ఇక ఇప్పుడు హైదరాబాద్ మహానగరం వంతు వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీలోని హార్డ్ రాక్ కేప్ కు సమీపంలో ఉన్న నాలెడ్జ్ సిటీలోని ఆర్ఎంజడ్ ది లాఫ్ట్ లో ఈ రెస్టారెంట్ ను శుక్రవారం నాడు ప్రారంభిస్తున్నట్లు విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపారు. ఇందులో మీతో కొన్ని కొత్త విషయాలను షేర్ చేసుకోవడానికి సంతోషిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ పోస్ట్ లో ‘మేము ఇప్పటికే హైదరాబాద్ హైటెక్ సిటీ నడిబొడ్డుకు వచ్చేశాం. నాకు, వన్8 కమ్యూన్ అనేది కేవలం ఒక రెస్టారెండ్ మాత్రమే కాదు. ఇది హైదరాబాద్ లోని ప్రజలను ఒకేచోటకు చేర్చడం మా ముఖ్య ఉద్దేశం’ అంటూ కోహ్లీ వ్యాఖ్యానించారు. తన రెస్టారెంట్ కు విచ్చేయాలని ఆయన ఈ సందర్బంగా ఆహ్వానించారు.
Tirupati: విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు..డీఎస్పీ మనోహరాచ్చారి స్పష్టం
అలాగే మే 24న తాను మా తలుపులు తెరిచే సమయంలో, మీరు కమ్యూనింగ్ స్ఫూర్తిని అనుభవం పొందితే తాము చాలా సంతోషిస్తామని., మీరు కమ్యూన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా..? అయితే మీ రిజర్వేషన్ లను ఇప్పుడే చేయండి. 9559071818, 9559081818 అంటూ ఫోన్ నెంబర్లను కూడా కోహ్లీ పేర్కొనడం చూడవచ్చు. విరాట్ రెస్టారెంట్ కావడంతో ఇప్పటికే దానిని చూసేందుకు అనేక మంది రావడం గమనార్హం. ఈ రెస్టారెంట్ లో దేశీ వంటకాలతోపాటు విదేశీ వంటకాలను కూడా ఉండనున్నాయి.