Virat Kohli: “మరో స్పెషల్ ఛేజ్‌కు నేను రెడీ”.. ఐపీఎల్ తొలి మ్యాచ్‌కు ముందు SRHకు కోహ్లీ మాస్ వార్నింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య ఉండనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2026 కోసం పూర్తిగా సిద్ధమైంది. మార్చి 28న తమ సొంతగడ్డ (ఎం. చిన్నస్వామి స్టేడియం)పై సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో తపడేందుకు ఉర్రూతలూగుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు వాతావరణం ఇప్పటికే వేడెక్కింది. ఆర్‌సీబీ సూపర్‌స్టార్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో విరాట్ ప్రత్యర్థి టీమ్‌లకు హెచ్చరికలు జారీ చేశాడు. ఈ సారి ప్రత్యేకమైన ఛేజింగ్‌కు సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. ఈ వీడియో అభిమానుల ఎంతగానో ఉత్సాహ పర్చింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది. “చాలా టీమ్స్‌లో అద్భుతమైన ప్లేయర్స్ ఉంటారు. కొన్ని టీమ్స్‌లో ప్రధాన పాత్రధారి ఉంటారు. కానీ.. ఒక టీమ్‌లో మాత్రం “కింగ్” ఉన్నాడు. కింగ్ తన రాజ్యానికి తిరిగి వస్తున్నాడు.” అంటూ గూస్‌బంప్స్ తెప్పించే బ్యాగ్రౌండ్ వాయిస్‌తో వీడియో ప్రారంభమైంది. ఇక ఈ వీడియోలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. “నేను ఈ జెర్సీ వేసుకున్న ప్రతిసారీ నా సర్వశక్తులు ఒడ్డి ఆడతాను. మరో ప్రత్యేకమైన ఛేజ్‌కు నేను సిద్ధంగా ఉన్నాను.” అని విరాట్ అనడం వీడియోలో కనిపిస్తోంది. “అదే అధ్యాయం, కొత్త కథ. ఎల్లప్పుడూ మీతోనే, మీ విరాట్ కోహ్లీ.” అంటూ చివరిలో విరాట్ కన్నడలో అభిమానుకు మెసేజ్ ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంది. ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా, కింగ్ కోహ్లీ బెంగళూరుకు తిరిగి వచ్చాడని, కొత్త కథ రాయడానికి సిద్ధంగా ఉన్నాడని ఆర్‌సీబీ స్పష్టమైన సందేశం పంపింది.
READ MORE: SRK : యాక్షన్ జోనర్‌కు బ్రేక్.. రొమాంటిక్ ఫిల్మ్ చేసే యోచనలో కింగ్ ఖాన్
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
ఇక గత సీజన్‌లో, రజత్ పాటిదార్ కెప్టెన్సీలో ఆర్‌సీబీ ఏళ్లుగా ఎదురుచూస్తున్న విజయాన్ని సాధించింది. పంజాబ్ కింగ్స్‌ను ఓడించి తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. అహ్మదాబాద్‌లో జరిగిన ఆ ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌పై 191 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సీబీ విజయవంతంగా కాపాడుకుంది. విరాట్ కోహ్లీ 43 పరుగుల కీలకమైన ఇన్నింగ్స్‌తో విజయానికి పునాది వేశాడు. ఇక ఆర్‌సీబీతో విరాట్ కోహ్లీ బంధం కేవలం ఒక ఆటగాడిదిగానే కాకుండా, ఒక గుర్తింపుగా మారింది. కోహ్లీ ఇప్పటివరకు ఆర్‌సీబీ తరఫున 267 ఐపీఎల్ మ్యాచ్‌లలో 8 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలతో సహా 8661 పరుగులు సాధించాడు. ఈ సమయంలో కోహ్లీ సగటు 39.54 కాగా, స్ట్రైక్ రేట్ 132.85గా ఉంది. ఐపీఎల్‌లో కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన 2016 సీజన్‌లో కనబడింది. ఆ సీజన్‌లో అతను 16 మ్యాచ్‌లలో 81.08 సగటుతో 973 పరుగులు చేశాడు. మరోసారి రికార్డులు బద్దలు గొట్టేందుకు సిద్ధమయ్యాడు.
READ MORE: AB de Villiers-RCB: ఆర్సీబీ దుమ్ము రేపడం ఖాయం.. వరుసగా రెండు, మూడు కప్పులు కొడుతుంది!
తాజావార్తలు
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!