టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.. డిసెంబర్ 26 (గురువారం) నుంచి మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో భారత్ నాలుగో టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. కోహ్లీపై ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ప్రముఖ గాయకుడు, బిగ్‌బాస్ పార్టిసిపెంట్ రాహుల్ వైద్యను కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ తనను బ్లాక్ చేశాడని రాహుల్ ధృవీకరించాడు. అయితే దీనికి గల కారణాలను మాత్రం చెప్పలేదు. కోహ్లీ తనను ఎందుకు బ్లాక్ చేశాడో కూడా తనకు ఇప్పటికీ తెలియదని రాహుల్ అన్నాడు.
Read Also: Team India: టీమిండియా బ్యాటర్లకు షాక్.. దెబ్బకు పడిపోయారుగా..!
రాహుల్‌కి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది, అందులో కొంతమంది విరాట్ కోహ్లీ గురించి అడిగారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ.. ”విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను బ్లాక్ చేసాడు.. అన్నయ్య ఎందుకు బ్లాక్ చేశాడో నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు.. నేను ఎప్పుడూ ఆయన్ను పొగడటమే తప్ప విమర్శించిందే లేదు. ఏం జరిగిందో నాకు తెలియదు.” అని చెప్పుకొచ్చాడు.
Read Also: Bangladesh: యూనస్ ప్రభుత్వంపై షేక్ హసీనా కుమారుడి సంచలన ఆరోపణలు..
2004లో ఇండియన్ ఐడల్‌తో రాహుల్ వెలుగులోకి వచ్చాడు. ఆయన పాటలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. ఆ తర్వాత అతను బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ గాయకుడిగా పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. 2020లో హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్ రన్నరప్‌గా నిలిచాడు. అంతే కాకుండా.. అతను ఖత్రోన్ కే ఖిలాడీ-11లో కూడా పాల్గొన్నాడు.