టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.. డిసెంబర్ 26 (గురువారం) నుంచి మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో భారత్ నాలుగో టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. కోహ్లీపై ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ప్రముఖ గాయకుడు, బిగ్‌బాస్ పార్టిసిపెంట్ రాహుల్ వైద్యను కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ చేశాడు.