JR NTR Fans : ఈ మధ్య సెలబ్రిటీల ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇంకొన్ని సార్లు అసభ్యకరంగా వాటిని మార్ఫింగ్ చేసి పోస్టులు పెడుతున్నారు. వీటిపై చాలా మంది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంలో సీపీ సజ్జనార్ ను కలిశారు. జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్నారంటూ సీపీ సజ్జనార్ కు ఫిర్యాదు చేశారు ఎన్టీఆర్ అభిమానుల…
Udhayanidhi Stalin : తమిళనాడు డిప్యూటీ సీఎం, హీరో అయిన ఉదయనిధి స్టాలిన్ పేరు సోషల్ మీడియాలో ఎంత ట్రెండింగ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన చేసే పోస్టులు, కామెంట్లు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రచ్చకు దారి తీస్తాయి. అవతలి పార్టీ వాళ్లు ఉదయనిధి పోస్టులకు నానా రచ్చ చేస్తుంటారు. తాజాగా ఉదయనిధి అనుకోకుండా నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన నివాశియ్ని కృష్ణన్ గ్లామర్ ఫొటోలను షేర్ చేశారు. కానీ వెంటనే గమనించి ఆ…
సుప్రీం ధర్మాసనం..‘‘ఇది పూర్తిగా ప్రచార ప్రయోజన వ్యాజ్యం. వెళ్లి దేవుడినే ఏదైనా చేసుకోమని అడగండి. మీరు విష్ణువు భక్తులని మీరు అనుకుంటే, మీరు ప్రార్థన చేసి, కొంత ధ్యానం చేయండి’’ అని సీజేఐ అన్నారు. ఈ ఆలయం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికార పరిధి కిందకు వస్తుందని పేర్కొంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
లిటిల్ హార్ట్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మౌళి, డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఫస్ట్ షో నుంచి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. రొటీన్ కథే అయినా, తనదైన శైలిలో మౌళి సినిమా మొత్తాన్ని భుజాల మీద మోసాడు. ఇక హీరోయిన్‌గా నటించిన శివాని కూడా క్యూట్‌గా కనిపించడంతో, నిర్వాణీ లవ్ స్టోరీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది. అయితే, ఈ సినిమా చూసిన చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అయితే,…
యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మోగ్లీ 2025’. సందీప్ రాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా, బండి సరోజ్ కుమార్ విలన్‌గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదలైన గ్లింప్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా బండి సరోజ్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రశంసలు అందుతున్నాయి. అయితే, తనను ప్రశంసిస్తూ…
సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకే న్యూస్ హల్‌చల్ చేస్తోంది. అదే ఫిష్ వెంకట్ కుటుంబానికి ప్రభాస్ సాయం! గతంలో ఎన్నో సినిమాల్లో విలన్ గ్యాంగ్‌లో కనిపించిన ఫిష్ వెంకట్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే, వయసు రీత్యా ఏర్పడిన అనారోగ్యం కారణంగా ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం కిడ్నీ దొరకక ఆయన కుటుంబం ఇబ్బంది పడుతోంది. ఒకవేళ కిడ్నీ దొరికినా,…
Samantha : సమంత మరోసారి నెటిజన్లపై విరుచుకుపడింది. ఈ సారి సీరియస్ గా పోస్ట్ పెట్టింది. తనపై చెత్త కామెంట్స్ పెట్టే వాళ్లకు సవాల్ విసిరింది. మొన్న ముంబైలో సమంత జిమ్ నుంచి బయటకు వచ్చే వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అందులో ఆమె లుక్స్ చూసి కొందరు ట్రోల్స్ చేస్తూ నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఆమె మరీ అంత సన్నగా ఉండటంపై రకరకాల పోస్టులు వేసేశారు. వీటిపై తాజాగా సమంత సీరియస్ అయింది.…
Sharmishta Panoli: కోల్‌కతాకు చెందిన 22 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలికి కోల్‌కతా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆపరేషన్ సిందూర్ పై వివాదాస్పదంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెను గత వారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మే 31న శర్మిష్ట పనోలి గురుగ్రామ్ లో అరెస్ట్ అయ్యింది. ఆమె ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పహల్గాం దాడి తరువాత భారత సైన్యం చేపట్టిన చర్యలపై ప్రశ్నించిన ఒక పోస్ట్‌కు సమాధానంగా సామాజిక,…
CM Revanth Reddy : హైదరాబాద్ యూనివర్సిటీ భూములను లాక్కున్నట్లుగా సోషల్ మీడియా నెట్ వర్క్ కృత్రిమంగా వివాదం సృష్టించటం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, అటవీ శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.…
సోషల్ మీడియాలో సంచలనంగా మారిన పరేషాన్ బాయ్స్ ఫేమ్ ఇమ్రాన్ తాజాగా ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేస్తూ.. తనపై, తన తల్లిపై నడుస్తున్న విమర్శలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నా అన్వేష్ వ్యాఖ్యలపై ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇమ్రాన్ తన వీడియోలో మాట్లాడుతూ.. "నా తల్లిని ఉద్దేశించి అనవసరంగా వ్యాఖ్యలు చేయడం బాధించేస్తోంది. ఇది వ్యక్తిగత విమర్శలకు, కుటుంబ సభ్యులను లాగడానికి చాలా దారుణమైన ఉదాహరణ. నా అన్వేష్…