రోజురోజుకి మారుతున్న టెక్నాలజీ పుణ్యమా అంటూ ప్రపంచంలో ఏ విషయం జరిగిన నిమిషాల వ్యవధిలో సోషల్ మీడియా ద్వారా విషయం అందరికీ తెలిసిపోతోంది. ఇందులో భాగంగానే ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుండడం మనం గమనిస్తూనే ఉంటాం. నిజానికి జుగాడ్ విషయంలో భారతీయులతో ఎవరూ సాటి రాలేరనే చెప్పొచ్చు. కాకపోతే ప్రస్తుతం బంగ్లాదేశ్ కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Also read: Viral: ఇదేందిరయ్య.. ఎప్పుడు చూడలే.. రంపం టైర్లతో దూసుకుపోతున్న స్పోర్ట్స్ బైక్..!
ఈ వీడియోలో రిక్షా కార్మికులు చేసిన జుగాఢ్ పని అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంది. ఈ వీడియోలో కొన్ని రిక్షాలు ఒక దానికి ఒకటి జత చేసిన తీరు కాస్త కొత్తగా కనిపించింది. బంగ్లాదేశ్ దేశానికి చెందిన కొందరు వ్యక్తులు కలిసి కొన్ని రిక్షాలను నడుపుతున్న వీడియో వైరల్ గా మారింది. ఈ జుగాడ్ ని చూసిన నెటిజన్లు అనేక రకరకాలగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో గమనిస్తే., ముందుగా ఒక రిక్షా ముందుకు కదులుతోంది, అలాగే దాని వెనుక మరొక రిక్షా ముందు చక్రం కట్టబడింది. ఇలా కొన్ని రిక్షాలు ఒకదానికొకటి కలపబడి ఉన్నాయి. అయితే ఇక్కడ ఓ విశేషం ఏంటంటే.. ప్రతి రిక్షా మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు. అందరూ కూడా అందరూ కూడా రిక్షా తొక్కుతున్నారు.
Also read: Viral: అసలు అలా ఎలా యాక్సిడెంట్ అయ్యిందిరా అయ్యా..?!
ఈ వీడియోని ఇప్పడి దాకా 3 లక్షల మందికి పైగా లైక్ చేశారు. వీడియో చూసిన నెటిజన్స్ ఈ బండికి బ్రేకులు ఎలా వేస్తారంటూ అడుగుతున్నారు. మరొకరైతే బంగ్లాదేశ్ లో కూడా మన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సెల్ఫ్ డ్రైవింగ్ కోచ్ లను మొదలు పెట్టిందని చెప్పుకొచ్చారు. ఇది స్మార్ట్ బంగ్లాదేశ్ అని ఒకరు రాశారు. మారేందుకు ఆలస్యం ఈ జుగాడ్ వీడియో ని మీరు కూడా చూసేయండి.