మామూలుగా మనం ఉపయోగించే టూ వీలర్ బైక్లలో ట్యూబ్ ఉన్నది, ట్యూబ్ లెస్ టైర్లు కలిగిన వాటిని మాత్రమే చూశాము. ఇదివరకు కాలంలో ఇనుము,చెక్కతో తయారు చేసిన టైర్లను కూడా చూసే ఉంటాం. కాకపోతే తాజాగా ఓ వ్యక్తి తన స్పోర్ట్స్ బైక్ కు రంపంతో కూడిన చక్రాలను అమర్చి నడుపుతున్నాడు. ఏంటి రంపంతో తయారు చేసిన చక్రాలు రోడ్డుపై ఎలా నడుస్తాయి అన్న ఆలోచన మీకు రావచ్చు. కాకపోతే.. అతను నడుపుతున్నది రోడ్డుపై కాదు.. బాగా చలితో గడ్డ కట్టిన నదిపై. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
also read: Viral: అయ్యయో.. తల్లి, పిల్లాడు రైలు ఎక్కుతుండగా షాకింగ్ ట్విస్ట్.. చివరికి..?!
నిజానికి మంచు కురిసే ప్రాంతాలలో.. రెగ్యులర్ టైర్లు ఉన్న వాహనాలు వాడటం చాలా ప్రమాదకరమని చెప్పవచ్చు. దీని కారణం రబ్బరు టైర్లు మంచు వల్ల జారిపోయే ప్రమాదం ఉంది. ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం లేకపోలేదు. ఇదే ఆలోచనతో ఓ యువకుడికి అద్భుతమైన ఆలోచన వచ్చింది. దాంతో తనకున్న స్పోర్ట్స్ బైక్ కు ఉన్న రబ్బరు టైర్లను తీసేసి రంపంతో చేసిన టైర్ లను అమర్చాడు. ఇంకేముంది అలా తయారు చేసిన బైకుతో తన స్టైల్ లో మంచుపై వేగంగా నడిపిస్తూ అబ్బురపడుస్తున్నాడు. కేవలం మంచు పై మాత్రమే కాదండి.. ఇతను మట్టి రోడ్లపై కూడా రైడ్ చేస్తున్నాడు. ఈ టైర్ల తో కొన్ని రకాల చెట్ల మొద్దులను కూడా కట్ చేసేస్తున్నాడు.
also read: Viral Video: మార్కెట్ లోకి దూసుకెళ్లిన ట్యాక్సీ డ్రైవర్.. ఒకరి మృతితో పాటు..?
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు వారికి తగ్గ కామెంట్స్ చేస్తున్నారు. ఈ బైక్ కింద పడితే ఎవరైనా సరే.. నలిగిపోవాల్సిందేనని కొందరు అంటుంటే.., మరికొందరు ఈ అబ్బాయి ఆలోచన అమోఘం అంటూ అతనిని పోగొడుతున్నారు.
Saw Blades make better wheels than you would think
[📹 cboystv]pic.twitter.com/kaiFk8EUq8
— Massimo (@Rainmaker1973) March 12, 2024