ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎందుకు పుడుతుందో తెలియదు. ఒక వ్యక్తి మనసుకు దగ్గరవడానికి ఒక్క నిమిషం, ఏదో ఒక సందర్భం చాలు. అందుకే ప్రేమను గుడ్డిది అంటారు. ప్రేమకు కుల, మత, జాతి, ఆస్తి, అంతస్థులు తేడాలు ఉండవు. అయితే ఈ ప్రేమకు ప్రస్తుతకాలంలో లింగం, వయసుతో కూడా సంబంధం ఉండటం లేదు. ఈ ప్రేమ కథను తెలుసుకుంటే మాత్రం ఎంట్రా ఇది నేనెప్పుడు సూడలా అనడం పక్కా. ఇప్పటి వరకు వయసులో చాలా చిన్నదైన అమ్మాయి తనకంటే పెద్దవాడైన ముసలివాడిని పెళ్లి చేసుకున్న సందర్భాలు చూశాం. కానీ ఈ ప్రేమ కథ వాటికి భిన్నం.
23 ఏళ్ల ఓ యువకుడు.. ఏకంగా తన తాత వయసున్న 66 యేళ్ల వృద్దుడిని ప్రేమించాడు. అక్కడితో ఆగకుండా అతడిని పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ ఘటన ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఆరోన్ (29), అతని భర్త మైఖేల్ (66) ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో నివసిస్తున్నారు. ఇంటర్న్‌షిప్ చేయడానికి న్యూయార్క్ వెళ్లిన సమయంలో అరోన్ మైఖేల్ ను కలిశాడు. వారు కలిసే సమయానికి ఆరోన్ వయసు 23 యేళ్లు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే వారిద్దరూ నేరుగా కాకుండా గ్రైండర్ అనే ఒక డేటింగ్ యాప్ ద్వారా కలుసుకున్నారు.
Also Read: Viral Video: టీచరమ్మ నువ్వు గ్రేట్… ప్రతి ఆడపిల్ల చూడాల్సిన వీడియో!
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే మాట వినే ఉంటాంగా వీరి ప్రేమకథ కూడా అలాంటిదే. మైఖేల్ ను చూసిన మొదటి చూపులోనే అరోన్ ప్రేమలో పడిపోయాడట. మైఖేల్ వృద్ధుడని తెలిసిన పీకల్లోతు ప్రేమలో పడిపోయాడు.
లాక్‌డౌన్ సమయంలో ఇద్దరూ భార్యాభర్తల మాదిరిగానే ఒకే గదిలో ఉండేవారమని ఆరోన్ తెలిపాడు. కరోనా కాలంలో కూడా మైఖేల్ కోసం డబ్లిన్ వెళ్లానని అరోన్ పేర్కొన్నాడు. ఇక లాక్డౌన్ ముగిసిన వెంటనే వారిద్దరూ వివాహం చేసుకున్నారని, ఇక వీరి బంధంలో మైఖేల్ భర్త అయితే, అరోన్ భార్యట. మైఖేల్ వృద్ధుడు అయినప్పటికీ.. చాలా ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పుకొచ్చారు.
వీరి బంధంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ఎంతో మంది హేళన చేసినా వాటి అధిగమించి బతకడం నేర్చుకున్నామని ఈ జంట చెబుతుంది. అయితే ఈ విచిత్రమైన జంట గురించి తెలిసిన వారు మాత్రం ఇలా కూడా ప్రేమించుకుంటా అంటూ నోరెళ్లబెడుతున్నారు.