తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైన తర్వాత ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. ఎన్నికల్లో ఓటమి చెందిన దగ్గరి నుంచి కేసీఆర్ అక్కడి నుంచి బయటకు రాలేదు. ఏ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కాగా.. ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఫామ్ హౌస్ లోనే సమావేశమయ్యారు. అయితే.. ఈరోజు కేసీఆర్ స్వగ్రామమైన చింతమడక గ్రామస్తులు ఆయనను కలిసేందుకు ఫామ్ హౌస్ కు వచ్చారు.
Read Also: Rahul Gandhi: “రాహుల్ గాంధీకి రాజకీయ పరిపక్వత లేదు”.. ప్రణబ్ ముఖర్జీ పుస్తకంలో కీలక విషయాలు..
దాదాపు 500 మంది గ్రామస్తులు 9 బస్సుల్లో ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. అయితే.. వారు అక్కడికి చేరుకోగానే పోలీసులు చెక్ పోస్ట్ వద్దే ఆపేశారు. లోపలి నుంచి అనుమతి వస్తేనే పంపిస్తామని తెలిపారు. దాదాపు 2 గంటల సేపు వేచి ఉన్న తర్వాత వారికి ఫామ్ హౌస్ లోకి వెళ్లేందుకు అనుమతి వచ్చింది. దీంతో కేసీఆర్ ను చింతమడక గ్రామస్తులు కలిశారు. కాగా.. అక్కడికి వచ్చిన జనాలను చూసి కేసీఆర్ అభివాదం చేశారు. దీంతో వారందరూ.. సీఎం కేసీఆర్, సీఎం కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.
Read Also: MLC Kavitha: కేసీఆర్తో సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు