నిన్న పెద్దపల్లి నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటనలో భాగంగా కేటీఆర్ చేసిన ప్రసంగాన్ని మీడియా సమావేశంలో తీవ్రంగా ఖండించారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షులు చింతకుంట విజయరమణ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమూల్ బేబీ కేటీఆర్ నీకు రాజకీయ పరిజ్ఞానం ఉందా..? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి షాడో ముఖ్యమంత్రిగా కేటీఆర్ అని, కేటీఆర్.. నువ్వు పెద్దపల్లికి వస్తే భయంతో కాంగ్రెస్ పార్టీ నాయకులను,కార్యకర్తలను అరెస్ట్ చేపించావన్నారు విజయరమణ రావు. నీ బీఆర్ఎస్ పార్టీలోకి నేను వస్తా అనే సొల్లు కబుర్లు చెప్పి నా మీద తప్పుడు ఆరోపణలు మోపుతావా కేటీఆర్.. దమ్ముంటే నిరూపించూ అని, తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం… రాసిపెట్టుకో కేటీఆర్ అని విజయరమణ రావు వ్యాఖ్యానించారు.
Also Read : Vinayaka Temple : ఆ వినాయక గుడికి వెళితే.. పెళ్లిళ్లు జరుగుతాయట.. ఆ గుడి ఎక్కడుందంటే?
అంతేకాకుండా.. ‘ చెన్నూరు, రామగుండం నియోజకవర్గాల్లో నిధులు మంజూరు చేసి, పెద్దపల్లి నియోజకవర్గానికి ఎలాంటి నిధులు కేటాయించకుండా చేతులు దులుపుకొని పోయి.. మీ ఎమ్మెల్యే బంగారి అని రూపాకల్పనా చేసి పోతావా..! పెద్దపల్లి నియోజకవర్గాన్ని నీ తుప్పు పట్టిన ఎమ్మెల్యే ఇసుక, మట్టి మాఫియా చేసి నాశనం చేస్తున్నాడు.. నియోజకవర్గంలో 24 గంటల కరెంట్ ఎక్కడ వస్తుందో రండి కేటీఆర్ .. నువ్వు, నేను, నీ ఎమ్మెల్యే పోయి చూద్దాం.. మీలాగా తెలివి తక్కువ వాళ్ళే కరెంటు తీగలు పట్టుకుంటారు.. మా లాంటి వాళ్ళు విద్యుత్ సబ్ స్టేషన్ లోని లాగ్ బుక్ లను చూస్తారు.. మీరు దొంగతనంగా ఎత్తుకుపోయిన లాగ్ బుక్ లను చూడు కేటీఆర్.. ఎన్ని గంటల కరెంటు వస్తుందో తెలుస్తది.. 24 గంటల కరెంట్ రాకుంటే నీ ఎమ్మెల్యే మరియు నువ్వు రాజకీయ సన్యాసం స్వీకరిస్తారా..? నీ తుప్పు పట్టిన ఎమ్మెల్యే రైతుల వడ్లు దోచుకోవడంలో నెంబర్ 1 వన్. మీ ఎమ్మెల్యే ఓడిపోతాడని పరోక్షంగానే చెప్పినవ్ కదా కేటీఆర్.. మనోహర్ రెడ్డి నువ్వు కర్ణాటక కి రా అక్కడ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయో లేదో చూపిస్తాం… తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార లోకి రాగానే 6 గ్యారంటీ పథకాలను అమలు చేసి చూపిస్తాం…’ అని విజయరమణ రావు అన్నారు.
Also Read : Chinmayi: డబ్బు ఎంతైనా ఇస్తా.. నాతో గడుపు అన్నాడు..