తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది గోట్’.. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.. ఈ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి విడుదల చెయ్యాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు… తాజాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..
ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ నెట్‌వర్క్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. భారీ ధరకి ఈ రైట్స్‌ను జీ నెట్ వర్క్ దక్కించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.. మెర్సల్ తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ సినిమాను జీ కొనుగోలు చెయ్యడం విశేషం.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి..
ఇక అన్ని కార్యక్రమాలు ఆనుకున్న విధంగా జరిగితే ఈ ఏడాది సెప్టెంబర్ 5 నా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ సినిమాలో జయరామ్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, మైక్ మోహన్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.. ఎజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కల్పాతి, కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.. పాన్ ఇండియా సినిమా విడుదల కాబోతుంది..