తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ‘ది గోట్’.. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందని తెలుస్తుంది… మొన్నీమధ్య శాటిలైట్ రైట్స్ ను ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు తాజాగా ఓటీటీ రైట్స్ ను భారీ ధరకు ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది..
ఈ చిత్రం శాటిలైట్ హక్కులను జీ నెట్‌వర్క్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.. డిజిటల్ రైట్స్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అతని తాజా సినిమా గోట్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైంను నెట్ ఫ్లిక్స్ సంస్థ 110 కోట్లకు ఒప్పందం చేసుకుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.. ఈ విషయం పై అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది.
ఈ మూవీ అనుకున్న విధంగా జరిగితే ఈ ఏడాది సెప్టెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ సినిమాలో జయరామ్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, మైక్ మోహన్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.. ఎజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కల్పాతి, కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు..