Rashmika Mandanna: హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న నిశ్చితార్థం ఈనెల 3న నిరాడంబరంగా జరిగింది. ఈ వార్త బయటకు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారు. తరచూ బయటకు వెళ్లి దొరికిపోతున్నా వీరు మాత్రం సైలెంట్ గానే ఉండిపోయారు. ఎట్టకేలకు వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. 2026లో వీరి పెళ్లి ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో పాటు జస్ట్ ఫ్రెండ్స్ అంటూ కలరింగ్ ఇస్తూ వచ్చారు. అయితే.. తాజగా జరిగిన ఎంగేజ్‌మెంట్ విషయాన్ని ఇద్దరూ అధికారికంగా ప్రకటించలేదు.
READ MORE: Priyanka Mohan: నెట్టింట ప్రియాంకా మోహన్ హాట్ ఫోటోస్.. ఘాటు రియాక్షన్!
తాజాగా ఎంగేజ్‌మెంట్ తర్వాత రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె తన పెంపుడు కుక్క ఆరాతో ఆడుకుంటున్నట్లు చూడవచ్చు. అయితే.. ఈ వీడియోలో రష్మిక చేతికి ఓ డైమండ్ ఉంగరం కనిపించింది. ఈ వీడియోను చూసిన అభిమానుల దృష్టి ఆ ఉంగరంపై పడింది. నిశ్చితార్థం అనంతరం విజయ్ సైతం చేతికి ఉంగరం ధరించి కనిపించాడు. రీసెంట్ గా పుట్టపర్తి సాయిబాబా సమాధిని దర్శించుకున్నారు విజయ్. దీంతో ప్రశాంతి నిలయం ట్రస్ట్ సభ్యులు విజయ్ కు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోల్లో విజయ్ చేతికి ఉంగరం కనిపించింది. అలాగే తాజా వీడియోలో రశ్మిక చేతికి సైతం ఉంగరం ఉండటంతో ఇవి పక్కా ఎంగేజ్ మెంట్ రింగ్స్ అంటూ ప్రచారం మొదలైంది.
READ MORE: US: అమెరికాలోని ఓ ప్లాంట్‌లో పేలుడు.. 19 మంది మృతి!