Vi and Vivo: టెలికాం సంస్థ Vi (Vodafone Idea), ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo Indiaతో భాగస్వామ్యం చేసుకుంది. ఈ భాగస్వామ్యంతో Vivo V50e కొనుగోలు చేసే వినియోగదారులకు ప్రత్యేకంగా రూ.1,197 విలువైన 5G ప్రీపెయిడ్ బండిల్ ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు రోజుకు 3GB డేటా, అనియమిత కాల్స్, OTT సభ్యత్వాలు, లైవ్ టీవీ చానళ్లకి ఉచిత యాక్సెస్ లభిస్తుంది.
Read Also: RCB Victory Parade Stampede: ఆర్సీబీ విక్టరీ పరేడ్.. తొక్కిసలాటకు ప్రధాన కారణం ఇదే..
Vi ప్రకటించిన ప్రకారం.. రూ.1,197 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల పాటు చెల్లుబాటవుతుంది. ఇందులో వినియోగదారులు Vi Movies, TV లో 12 నెలల ఉచిత సభ్యత్వం పొందవచ్చు. అంతేకాకుండా జియో సినిమా, Zee5, Sony Liv, Lionsgate Play, Fancode వంటి 17 OTT ప్లాట్ ఫార్ములకు యాక్సెస్ కూడా లభిస్తుంది. అలాగే 350కిపైగా లైవ్ టీవీ చానళ్లను వీక్షించవచ్చు. వినియోగదారులకు రోజుకు 3GB డేటా, 100 ఉచిత SMSలు, అనియమిత వాయిస్ కాల్స్ లభిస్తాయి.
ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలంటే, ఏప్రిల్ 17 నుండి June 30, 2025 మధ్యలో Vivo V50e మొబైల్‌ను కొనుగోలు చేసి, అందులో Vi ప్రీపెయిడ్ సిమ్ కార్డ్‌ని వాడాలి. ఆ తరువాత రూ.1,197తో రీచార్జ్ చేయడం ద్వారా ప్లాన్ యాక్టివేట్ అవుతుంది. మొదటి రీచార్జ్‌తో Vi మూవీస్, TV కు మూడు నెలల ఉచిత యాక్సెస్ లభిస్తుంది. Vi మూవీస్, TV యాప్ ను డౌన్లోడ్ చేసి, Vi నంబర్‌తో లాగిన్ అయి మొబైల్ లేదా స్మార్ట్ టీవీలో స్ట్రీమింగ్ ఆస్వాదించవచ్చు.
Read Also: DK Shivakumar: చిన్న స్వామి స్టేడియంలో తొక్కిసలాట.. స్పందించిన డిప్యూటీ సీఎం..!
Vivo V50e భారత్‌లో ఏప్రిల్ 2025లో విడుదలైంది. ఇందులో MediaTek Dimensity 7300 ప్రాసెసర్, 5,600mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ చార్జింగ్, 50MP డ్యుయల్ రియర్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 8GB + 128GB వేరియంట్ ధర రూ. 28,999 కాగా, 8GB + 256GB వేరియంట్ ధర రూ. 30,999 గా ఉంది. అయితే, ఈ భాగస్వామ్యం వారి 5G విస్తరణ ప్రణాళికలో భాగమే. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, పాట్నా, చండీగఢ్ వంటి నగరాల్లో 5G సేవలు ప్రారంభమవగా 2025 ఆగస్టు నాటికి దేశవ్యాప్తంగా 17 ప్రాధాన్యత కలిగిన సర్కిళ్లలో 5G సేవలు విస్తరించనున్నట్లు సంస్థ పేర్కొంది.