Dhurandhar 2: సరిహద్దు దాటిన నిరీక్షణ.. ధురంధర్ 2 కోసం ఎదురుచూస్తున్న పాకిస్థానీయులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar 2: చాలా రోజుల తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రంగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సినిమా ధురంధర్. ఇండియన్ బాక్సాఫీస్ వద్దనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సృష్టించిన కలెక్షన్స్ మామూలుగా లేవు. ఈ చిత్రం మిడిల్ ఈస్ట్, పాకిస్థాన్‌లో రిలీజ్ కానప్పటికీ, ఈ చిత్రం విదేశాలలో 33 మిలియన్లకు పైగా వసూలు చేసింది. తాజాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై సంచలనాలు నమోదు చేస్తుంది. విడుదలైన కొన్ని రోజుల్లోనే ధురంధర్ పాకిస్థాన్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1 ట్రెండింగ్‌లో ఉంది.
READ ALSO: China: మరణశిక్షల్లో చైనా నయా రికార్డ్.. 30 రోజులు – 15 ఉరిశిక్షలు!
Also Read
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
- AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
- Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్‌కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
పలు నివేదికల ప్రకారం.. శనివారం నుంచి నెట్‌ఫ్లిక్స్ పాకిస్థాన్‌లో టాప్-1 ట్రెండింగ్ చిత్రంగా ధురంధర్ నిలిచింది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత జనవరి 30వ తేదీ శుక్రవారం ఓటీటీలో విడుదలైంది. ధురంధర్ సినిమా ఒక స్పై త్రిల్లర్. ఇందులో హీరో రణ్‌వీర్ పాకిస్థాన్‌లోని లియారీలో ఒక ముఠాలో చేరి భారతీయ గూఢచారి పాత్రను పోషిస్తాడు. ఇది నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం. గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ చిత్రాలను పాకిస్థాన్ థియేటర్లలో విడుదల చేయడానికి అనుమతి లేకపోవడంతో ఈ సినిమా పాకిస్థాన్‌లో విడుదల కాలేదు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం నయా సంచలనాన్ని సృష్టించింది.
ఈ చిత్రాన్ని చూసిన పలువురు పాకిస్థానీలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో పాజిటిల్ కామెంట్స్ చేస్తున్నారు. రెడ్డిట్‌లో పోస్ట్ చేసిన ఒక కామెంట్‌ను పరిశీలిస్తే.. “ఒక పాకిస్థానీగా, ఇది నేను చూసిన అత్యుత్తమ బాలీవుడ్ చిత్రం. మొదటిసారిగా నేను నిజంగా పరిశోధన చేసిన, పాకిస్థానీలను చిత్రీకరించడానికి “ఆదాబ్,” “జనాబ్,” సుర్మా కాజల్, టోపీ, చొక్కా ఉపయోగించని చిత్రాన్ని చూశాను. నేరాలలో పాల్గొన్న రాజకీయ పార్టీని చూపించి వారిని బహిర్గతం చేసినందుకు ధన్యవాదాలు. పార్ట్ 2 పై నాకు చాలా ఆశలు ఉన్నాయి, కానీ దయచేసి చౌదరి అస్లాంను సానుకూల పాత్రగా ఉంచండి. ఇది నా అభ్యర్థన. మొత్తంగా ఇది అద్భుతమైన చిత్రం. ఈ సినిమా తారాగణం, షూటింగ్, కథ, ప్రతిదీ పరిపూర్ణంగా ఉంది.” మరొక పాకిస్థానీ మూవీ లవర్ ఈ చిత్రాన్ని విశ్లేషిస్తూ.. “నేను ఒక పాకిస్థానీని, అయినా నేను ధురంధర్‌ను చాలా బాగా ఆస్వాదించాను. మేము మిమ్మల్ని ద్వేషించే కథలను రూపొందించడం మానేయాలి. నేను ఈ చిత్రాన్ని ప్రేమిస్తున్నాను” అనేక మంది పాకిస్థానీలు ఈ చిత్రాన్ని మళ్ళీ చూస్తామని చెప్పారు. ఈ చిత్రం పాకిస్థాన్‌ను చెడుగా చూపించలేదని, దానికి బదులుగా సానుకూలంగా చూపించిందని అనేక మంది పాకిస్థానీలు చెబుతున్నారు. ఈ సినిమాలో పాకిస్థానీలకు వ్యతిరేకంగా ఏమీ లేదని, కానీ భారతీయులకు వ్యతిరేకంగా చాలా ఉందని, మొత్తంగా ఈ సినిమా చాలా బాగుందని వెల్లడించారు. అనేక మంది పాకిస్థానీలు ఇప్పుడు ధురంధర్ 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ధురంధర్ సీక్వెల్ విషయానికి వస్తే ఈ చిత్రం మార్చి 19న విడుదల కానుంది.
READ ALSO: IND vs PAK Match Refund: భారత్‌తో పాక్ మ్యాచ్ ఆడకపోతే.. ఫ్యాన్స్‌కు రీఫండ్ వస్తుందా?
తాజావార్తలు
-
Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
-
Assam Magic Rice: “మ్యాజిక్ బియ్యం”.. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
-
BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
-
BeiGo X4: 100KM రేంజ్‌తో కొత్త 3-వీలర్ EV.. ధర ఎంతో తెలుసా?
-
AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!