VENOM: THE LAST DANCE Telugu Trailer: సోనీ పిక్చర్స్ ఇండియా ప్రైవైట్ లిమిటెడ్, మార్వెల్ సంయుక్తంగా రూపొందించిన హాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీ ‘వెనమ్’. 2018లో వచ్చిన ‘వెనమ్’, 2021లో రిలీజైన ‘వెనమ్: లెట్ దేర్ బీ కార్నేజ్’లు బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. వెనమ్ సిరీస్‌లో మూడవ భాగం ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’. ఈ అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదటి రెండు భాగాలు సక్సెస్ అవ్వడంతో మూడో భాగంపై భారీ అంచనాలు ఏర్పడాయి.
అంచనాలకి తగ్గట్లుగానే ఇప్పటివరకు విడుదలైన ‘వెనమ్ – ది లాస్ట్ డాన్స్’ మూవీ పోస్టర్స్, ట్రైలర్లు సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తూ దూసుకుపోయాయిది. తాజాగా విడుదలైన ఫైనల్ ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ రావడం పక్కా. కొన్ని గంటల ముందు రిలీజ్ అయిన ఈ ట్రైలర్‌కు భారీ వ్యూస్ వచ్చాయి. ఇండియాలో ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. 3డి వెర్షన్‌లో ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించనుంది.
Also Read: Devara-Hollywood: హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘దేవర’.. వీక్షించనున్న ప్రముఖ నటులు!
‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’కు కెల్లీ మార్సెల్ దర్శకత్వం వహించాడు. మ్యాడ్ మ్యాక్స్, ది రెవినాంట్, ఇన్సెప్షన్ వంటి సినిమాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టామ్ హార్డీ.. వెనమ్‌లో హీరోగా నటిస్తున్నాడు. గత రెండు భాగాల్లో కూడా హార్డీనే హీరో. ఈ చిత్రంలో ఎడ్డీ బ్రాక్ పాత్రలో టామ్ హార్డీ కనిపిస్తారు. టామ్ హార్డీ నటనతో పాటు వెనమ్ క్యారెక్ట్ చేసే యాక్షన్ సన్నివేశాలు ఇందులో హైలట్‌గా నిలవబోతున్నాయి. ఈ ఫ్రాంచైజీలో ఇదే చివరి చిత్రం అవుతుందని హాలీవుడ్‌లో టాక్.