Site icon NTV Telugu

Venky – Anil 4 : వెంకీ మామ.. అనిల్ రావిపూడి.. షూటింగ్ ఎప్పుడంటే

Venky Anil 3

Venky Anil 3

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిది విడదీయలేని అనుబంధం. F2, F3, సంక్రాంతికొస్తున్నాం చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన ఈ జోడీ, ఇప్పుడు తమ ఐదవ సినిమా కోసం చేతులు కలిపారు. ఈ ప్రాజెక్ట్ జూలై 2026 నుండి పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాసిల్  ఎంపిక చేసినట్లు సమాచారం. పుష్ప చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఫహద్, ఈ సినిమాలో వెంకటేష్‌తో కలిసి నటించడం సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు హిలేరియస్‌గా, అదే సమయంలో ఎమోషనల్‌గా ఉంటాయని టాక్.

Also Read : Trisha : త్రిష ఈ ఏడాదైనా ఒక్క హిట్ అయినా కొడుతుందా?

ఈ భారీ ప్రాజెక్టులో హీరోయిన్ల విషయంలో కూడా క్రేజీ అప్‌డేట్స్ వినిపిస్తున్నాయి. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ మరియు బుట్టబొమ్మ పూజ హెగ్డే ఇందులో కథానాయికలుగా నటించే అవకాశం ఉంది. అయితే పూజ హెగ్డే ఇప్పటికే కొన్ని సినిమాలతో బిజీగా ఉన్నందున, అధికారిక ప్రకటన వెలువడితేనే ఈ విషయంపై స్పష్టత వస్తుంది. అనిల్ రావిపూడి అంటేనే సంక్రాంతి సెంటిమెంట్. అందుకే ఈ సినిమాను కూడా 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేలా పక్కా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం – AK 47’ అనే సినిమా చేస్తున్నారు. అది పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది

Exit mobile version