తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఏ కూరగాయ కొందామన్నా సామాన్యులు బాబాయ్ అనే పరిస్థితి నెలకొంది. డిమాండ్‌కు తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడంతో కూరగాయలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కూరగాయల ఉత్పత్తి తగ్గిపోగా.. డిమాండ్ పెరిగి ధరలు భగ్గుమంటున్నాయి.
Vegetable Prices are Increasing All Time High in Telangana: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఏ కూరగాయను కొందామనుకున్నా.. ధర కొండెక్కి కూర్చుంది. పట్టణాల్లోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో అదే పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని రీతిలో కూరగాయల ధరలు పెరిగాయి. ఎంతలా అంటే.. ఇదివరకు 100-200 రూపాయలు తీసుకెళ్తే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు రూ. 500 తీసుకెళ్లినా.. సంచి మాత్రం నిండడం లేదు. దాంతో కూరగాయల మార్కెట్ వెళ్లాలంటేనే…