రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలుకరించాడు. ఖుషి సినిమా మంచి విజయం సాధించింది.ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషీ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. తన గత సినిమా లైగర్ అట్టర్ ప్లాప్ అయ్యి విజయ్ ఆశలపై నీళ్లు చల్లింది..దీంతో విజయ్ దేవరకొండ ఖుషీ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తనకు ఎంతగానో కలిసి వచ్చిన లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో విజయ్ సరసన సమంత హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాను శివ నిర్వాణ డైరెక్ట్ చేయగా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయ్యి మంచి విజయం అందుకుంది.. ఇక విజయ్ దేవరకొండ తన తరువాత సినిమా షూటింగ్ లో బిజీ అయ్యాడు.
విజయ్ తన తరువాత సినిమాను గీతా గోవిందం వంటి బ్లాక్ బస్టర్ విజయం అందించిన పరశురామ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే స్టార్ట్ చేసారు. ‘VD13’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ శరవేగంగా జరుపుకుంటుంది .ఇప్పటికే 50 శాతం పైగానే షూట్ పూర్తి అయినట్టు సమాచారం… ఈ సినిమాపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో పాటు మిగిలిన ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి ఒక వార్త ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. ఈ సినిమా నుండి టైటిల్ మరియు ఫస్ట్ లుక్ అతి త్వరలోనే రాబోతుందట. ఇందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం… ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ముందుగానే ప్రకటించారు.