Varanasi: ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ హడావుడి గురించే చర్చ. హైదరాబాద్ శివారులో అత్యంత భారీగా ప్లాన్ చేసిన ఈ కార్యక్రమాన్ని అభిమానులతో పాటు వేలాదిమంది వీక్షిస్తున్నారు. ఈ ఈవెంట్ ప్రారంభంలోనే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న టైటిల్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాకు ‘వారణాసి’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సందర్భంగా ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ వీడియోను ఈవెంట్ స్క్రీన్ పై ప్రసారం చేశారు.
Varanasi: సూపర్ స్టార్ లుక్స్ అరాచకం అంతే.. మహేష్ బాబు-రాజమౌళి సినిమా పేరు అదే..!
విడుదలైన గ్లింప్స్ వీడియోలో హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు సరికొత్త వైల్డ్ లుక్స్‌లో కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నిమిషాల వ్యవధిలోనే ‘వారణాసి’ టైటిల్, మహేష్ కొత్త లుక్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చాయి. గత కొన్ని రోజులుగా ‘రుద్ర’, ‘వారణాసి’ వంటి పలు టైటిల్స్ వినిపించినప్పటికీ ఫైనల్‌గా రాజమౌళి ‘వారణాసి’ పేరుకే కట్టుబడి ఉన్నట్లు ఈ వీడియోతో స్పష్టమైంది. ఈ చిత్రంలో ఇప్పటికే కీలక పాత్రలను పరిచయం చేశారు. ప్రియాంక చోప్రా ‘మందాకిని’ పాత్రలో నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే విలన్‌గా ప్రేక్షకులను అలరించనున్నారు.
Mahesh Babu Fans Celebration: టైటిల్ రిలీజ్‌తో మహేష్ బాబు అభిమానుల్లో జోష్..