Mahesh Babu Fans Celebration: సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల పరంగానే కాకుండా రియల్ లైఫ్‌లో చేస్తున్న మంచి కార్యక్రమాలతో విశేషమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆయన సినిమా వస్తుందంటే మహేష్ అభిమానులకు పండుగతో సమానం అంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఆయన దర్శకధీరుడు రాజమౌళితో కొత్త సినిమా చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి కూడా ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి.
READ ALSO: Illegal Smuggling: అక్రమ కలప స్మగ్లింగ్ను అడ్డుకున్న అటవీ శాఖ..
మహేష్- రాజమౌళి సినిమా టైటిల్ ఇదే..
సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ సినిమా టైటిల్‌ను ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో విడుదల చేశారు. ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. శనివారం రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన ప్రత్యేకమైన ఈవెంట్‌లో టైటిల్‌తో పాటు, సినిమాకు సంబంధించిన చిన్న వీడియో క్లిప్‌ను కూడా రిలీజ్ చేశారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అభిమాన నటుడి సినిమా టైటిల్ రిలీజ్ కావడంతో, దాంతో పాటు సినిమాకు సంబంధించిన చిన్న వీడియో క్లిప్ బయటికి రావడంతో మహేష్ బాబు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొనడంతో రికార్డులు సృష్టిస్తుందని మహేష్-రాజమౌళి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO: Delhi Police Heroes: శభాష్ పోలీస్.. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను రక్షించారు