చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి, ఆ తర్వాత హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు, తమిళం, మలయాళంతో పాటు అన్ని భాషల్లో కలిపి 350కి పైగా సినిమాలు చేసి మెప్పించారు నటి ఊర్వశి. ఇప్పటికి కూడా తన వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకుంటూ నటిస్తోంది. సినిమా కెరీర్ ఎలా ఉన్నప్పటికీ తెర వెనుక.. నటీనటుల జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి. అలాగే ఊర్వశి జీవితంలో కూడా చాలా కష్టాలు పడినట్లుగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు..
Also Read : Salman Khan : ఒంటరితనమే మిగిలింది..
2000వ సంవత్సరంలో నటుడు మనోజ్ కె. జయన్ ను పెళ్లి చేసుకున్నా ఆమెకు తేజ లక్ష్మి అనే కూతురు కూడా ఉంది. కానీ ఈ ఇద్దరి దాంపత్య జీవితం ఎక్కువ కాలం సాగలేదు. 2008లో వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఊర్వశి 2013లో శివప్రసాద్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, తన మొదటి పెళ్లి ఎందుకు ఫెయిల్ అయ్యిందనే విషయాన్ని ఊర్వశి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఊర్వశి తన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మొదటిసారి పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టినప్పుడు అక్కడ వాతావరణం చాలా డిఫరెంట్‌గా అనిపించింది. ఇంట్లో అందరూ కలిసి తాగడం, తినడం చేసేవారు. ఆ వాతావరణానికి నేను అడ్జస్ట్ కావడానికి చాలా ప్రయత్నించి, చివరికి వారి పద్ధతులు నేర్చుకున్నా. దీంతో షూటింగ్ నుంచి రాగానే మందు కొట్టడం అలవాటైపోయి, అదే క్రమంగా వ్యసనంగా మారిపోయింది. అప్పటికే ఇంటి బాధ్యత నా భుజాలపై పడటంతో ఇష్టం లేని పనులు కూడా చేయాల్సి వచ్చింది. నా అభిప్రాయం ఎవ్వరికి నచ్చకపోవడం, గొడవలు జరగడంతో.. కోపంతో మరింత ఎక్కువ తాగేదాన్ని. తిండీ నిద్ర మానేసి మరీ తాగి, చేజేతులా నా ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నాను. కానీ నా స్నేహితులు, పర్సనల్ స్టాఫ్ వల్లే ఈ వ్యసనం నుంచి బయటపడగలిగాను’ అని ఊర్వశి చెప్పుకొచ్చారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.