Tilak Varma: స్టార్ బాయ్‌కి ప్రమోషన్.. సౌత్ జోన్ కెప్టెన్‌గా ఛాన్స్.!
- దులీప్ ట్రోఫీ 2026 కోసం..
- సౌత్ జోన్ కెప్టెన్‌గా తిలక్ వర్మను ఎంపిక..
- ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రికీ భుయ్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు..
- ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 10 వరకు బెంగళూరులో దులీప్ ట్రోఫీ 2026..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tilak Varma: భారత క్రికెటర్ స్టార్ బాయ్ ‘తిలక్ వర్మ’కు మరో కీలక బాధ్యత దక్కింది. ఈ మధ్యనే టీ20 అంతర్జాతీయ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన తిలక్.. ఇప్పుడు దులీప్ ట్రోఫీ 2026 కోసం సౌత్ జోన్ జట్టు కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బ్యాటర్ “రికీ భుయ్” ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
శనివారం ప్రకటించిన సౌత్ జోన్ జట్టులో హైదరాబాద్ స్టార్ తిలక్ వర్మకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఈ ప్రతిష్ఠాత్మక దేశీయ ఫస్ట్‌క్లాస్ టోర్నీ ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 10 వరకు బెంగళూరులో జరగనుంది. ఈసారి సౌత్ జోన్ జట్టులో భారత మాజీ టెస్టు క్రికెటర్ కరుణ్ నాయర్ కు కూడా అవకాశం లభించింది. అలాగే షేక్ రషీద్, ఆర్. స్మరణ్, ఎన్. జగదీశన్, శ్రేయాస్ గోపాల్ వంటి దేశీయ క్రికెట్లో రాణిస్తున్న కీలక ఆటగాళ్లు కూడా జట్టులో స్థానం సంపాదించారు.
Also Read
తిలక్ వర్మకు దులీప్ ట్రోఫీలో కెప్టెన్సీ కొత్త కాదు. 2025 సీజన్లో కూడా అతడిని సౌత్ జోన్ కెప్టెన్‌గా చేశారు. అయితే గాయం కారణంగా టోర్నీకి దూరమవడంతో.. ఆ బాధ్యతలను మహ్మద్ అజరుద్దీన్ చేపట్టాడు. 2023, 2024 సీజన్లలో సౌత్ జోన్, ఇండియా-A జట్ల తరఫున ఆడిన తిలక్ వర్మ దులీప్ ట్రోఫీలో 8 ఇన్నింగ్స్‌ల్లో 259 పరుగులతో 37 సగటు నమోదు చేశాడు. మొత్తంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 23 మ్యాచ్‌లు, 35 ఇన్నింగ్స్‌ల్లో 1,562 పరుగులు చేసి 50.38 సగటు కలిగి ఉన్నాడు.
గత సీజన్లో సౌత్ జోన్‌కు నాయకత్వం వహించిన మహ్మద్ అజరుద్దీన్ ఈసారి జట్టులో చోటు దక్కించుకోకపోవడం విడ్డురం. అలాగే దేవదత్ పడిక్కల్, గుర్జప్నీత్ సింగ్, ఆండ్రే సిద్ధార్థ్, తన్మయ్ అగర్వాల్, మోహిత్ కాలే, వి. కౌశిక్, సల్మాన్ నిజార్, అంకిత్ శర్మ, ఎం.డి. నిధీష్, నెడుమన్కుజీ బాసిల్ వంటి ఆటగాళ్లు కూడా జట్టుకు దూరమయ్యారు. వారి స్థానాల్లో కరుణ్ నాయర్, శ్రేయాస్ గోపాల్, అభినవ్ తేజ్రానా, కె. హిమతేజ, కె. సాయి తేజ, కావేరప్ప, అమన్ ఖాన్లకు అవకాశం కల్పించారు.
2025 దులీప్ ట్రోఫీలో మహ్మద్ అజరుద్దీన్ నాయకత్వంలోని సౌత్ జోన్ ఫైనల్ వరకు చేరింది. సెమీఫైనల్లో నార్త్ జోన్‌పై ఆధిపత్యం చెలాయించిన సౌత్ జోన్, ఫైనల్లో రజత్ పాటిదార్ నాయకత్వంలోని సెంట్రల్ జోన్ చేతిలో ఓటమి చవిచూసింది. 2023 దులీప్ ట్రోఫీని హనుమ విహారి నాయకత్వంలో సౌత్ జోన్ గెలుచుకుంది. చూడాలి మరి ఇప్పుడు తిలక్ వర్మ సారథ్యంలో మరోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంటుందోలేదో..
దులీప్ ట్రోఫీ 2026 సౌత్ జోన్ జట్టు:
తిలక్ వర్మ (కెప్టెన్), రికీ భుయ్ (వైస్ కెప్టెన్), అభినవ్ తేజ్రానా, షేక్ రషీద్, కె. హిమతేజ, రవిచంద్రన్ స్మరణ్, ఎన్. జగదీశన్, కరుణ్ నాయర్, తనయ్ త్యాగరాజన్, శ్రేయాస్ గోపాల్, కె. సాయి తేజ, త్రిపురాన విజయ్, కావేరప్ప, అమన్ ఖాన్.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!