Gulveer Singh History: గుల్వీర్ సింగ్ నయా చరిత్ర.. తొలి భారత అథ్లెట్‌గా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gulveer Singh History in Commonwealth Games 2026: భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ చరిత్ర సృష్టించాడు. ఒకే కామన్వెల్త్ గేమ్స్ ఎడిషన్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో రెండు పతకాలు గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా అరుదైన ఘనత అందుకున్నాడు. గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026లో పురుషుల 5000 మీటర్ల పరుగులో కాంస్య పతకం అందుకోవడంతో గుల్వీర్ ఈ రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు జూలై 28న జరిగిన 10,000 మీటర్ల రేసులో రజత పతకం గెలిచాడు. 10000 మీటర్లు, 5000 మీటర్లలోనూ పతకం సాధించి భారత అథ్లెటిక్స్ చరిత్రలో గుల్వీర్ సింగ్ తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.
28 ఏళ్ల గుల్వీర్ సింగ్ 5000 మీటర్ల ఫైనల్లో 13 నిమిషాల 24.95 సెకన్లలో రేసును పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచాడు. కెన్యాకు చెందిన మాథ్యూ కిప్చుంబా కిప్సాంగ్ 13:23.61 నిమిషాల టైమ్‌తో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా.. ఆస్ట్రేలియాకు చెందిన కై రాబిన్సన్ 13:24.70 నిమిషాలతో రజత పతకం గెలిచాడు. గుల్వీర్ చివరి ల్యాప్‌లో అద్భుతంగా పరుగెత్తి కెన్యాకు చెందిన కార్నెలియస్ కెంబోయ్ను కేవలం 0.04 సెకన్ల తేడాతో వెనక్కి నెట్టి కాంస్య పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
Also Read
- Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
- Vaibhav vs Ishan: క్రెడిట్ అంతా తీసుకున్నావ్.. వైభవ్ భవిష్యత్ కెప్టెన్.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
- CSK New Coach: సీఎస్కే కొత్త కోచ్.. ఎంఎస్ ధోనీ రెండు కీలక షరతులు!
ఈ సీజన్లో గుల్వీర్ సింగ్ అత్యుత్తమ టైమ్ 13:03.93 కాగా.. అతని జాతీయ రికార్డు 12:59.77. కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయినా.. ఒత్తిడిని తట్టుకుని పతకం సాధించడం విశేషం. 5000 మీటర్లు, 10000 మీటర్లలో జాతీయ రికార్డులు కలిగిన గుల్వీర్.. ఇప్పటికే 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో 10000 మీటర్లలో కాంస్య పతకం గెలిచి తన ప్రతిభను చాటుకున్నాడు. కామన్వెల్త్ గేమ్స్ 2026లో రెండు పతకాలు సాధించడం ద్వారా గుల్వీర్ భారత అథ్లెటిక్స్‌కు కొత్త మైలురాయిని అందించాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత క్రీడాకారుల సామర్థ్యాన్ని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పిన అతడు.. రాబోయే అంతర్జాతీయ టోర్నీల్లో కూడా మరిన్ని విజయాలు అందుకోనున్నాడు. గ్లాస్గోలో గుల్వీర్ నమోదు చేసిన ఈ చారిత్రక ప్రదర్శన భారత క్రీడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది.
తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?