Hardik Pandya: గర్ల్‌ఫ్రెండ్‌తో తిరుమలలో హార్దిక్ పాండ్యా.. శ్రీవారికి తలనీలాలు సమర్పించి కొత్త లుక్‌తో షాక్..!
- తిరుమల శ్రీవారిని దర్శించుకున్న
- టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా
- గర్ల్‌ఫ్రెండ్ మాహికా శర్మతో కలిసి ప్రత్యేక పూజల్లో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి క్రికెట్ కారణంగా కాదు.. ఆధ్యాత్మిక యాత్రతో అభిమానులకు కనపడ్డాడు. నేడు (ఆగస్టు 2) తెల్లవారుజామున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. హార్దిక్ తన గర్ల్‌ఫ్రెండ్ మాహికా శర్మతో కలిసి ఆలాయానికి వచ్చారు.
తలనీలాలు సమర్పన:
తిరుమల పర్యటనలో హార్దిక్ పాండ్యా శ్రీవారికి తలనీలాలు సమర్పించాడు. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమల దర్శనం సందర్భంగా హార్దిక్ పాండ్యా పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించారు. గుండు చేయించుకుని, కేవలం గడ్డంతో దర్శనమివ్వడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆయన మొక్కుబడి తీర్చుకునే భాగంగానే తలనీలాలు సమర్పించారా.? లేక మరేదైనా వ్యక్తిగత కారణం ఉందా.? అనేది తెలియాలి. అయితే హార్దిక్ కొత్త లుక్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read
భవిష్యత్‌పై జోరుగా ప్రచారం:
హార్దిక్ పాండ్యా ఇటీవల ఫిట్నెస్, ఆటపై పూర్తి దృష్టి పెట్టాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా ఐపీఎల్ భవిష్యత్‌పై కూడా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఐపీఎల్ 2027 వేలానికి ముందు ముంబై ఇండియన్స్‌ను వీడే అవకాశముందనే ప్రచారం క్రీడా వర్గాల్లో జోరుగా సాగుతోంది. 2024 సీజన్‌కు ముందు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించినప్పటికీ.. అతని నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 2024 సీజన్లో జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలవగా, తర్వాతి సీజన్లలో కూడా నిరాశాజనక ఫలితాలే నమోదయ్యాయి. గత సీజన్లో 14 మ్యాచ్‌ల్లో 10 ఓటములతో ముంబై 9వ స్థానంలో నిలిచింది.

CSK వైపు:
హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తీసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆసక్తి చూపుతోందని తెగ వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా ఈ స్టార్ ఆల్‌రౌండర్‌ను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ట్రేడ్ లేదా ఒప్పందం ఖరారు కాలేదు. మొత్తంగా 2027 సీజన్లో హార్దిక్ ఏ జట్టు జెర్సీలో కనిపిస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
Hardik Pandya offered his hair in Tirumala .
He took blessings today early morning with her GF Maheika Sharma at Tirupati Temple.
It looks like Hardik Pandya has finally made up his mind to make a strong comeback.🔥 pic.twitter.com/Js1QsmDbkb
— Jeet (@JeetN25) August 2, 2026
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!