Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Vangaveeti Radha Krishna Marriage On September 6th In Vijayawada

Vangaveeti Radha Marriage: వంగవీటి ఇంట పెళ్లి భాజాలు.. రాధా పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే..?

Published Date :August 16, 2023 , 11:57 am
By Sudhakar Ravula
Vangaveeti Radha Marriage: వంగవీటి ఇంట పెళ్లి భాజాలు.. రాధా పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vangaveeti Radha Marriage: వంగవీటి అనే పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు.. దానికి ప్రధాన కారణం వంగవీటి రంగా.. ఇక, ఆయన కుమారుడు వంగవీటి రాధా కృష్ణ కూడా రాజకీయాల్లో.. తన కమ్యూనిటీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా విజయవాడలో వంగవీటి ఫ్యామిలీకి పెద్ద ఎత్తున అనుచరులున్నారు.. అయితే, వంగవీటి ఫ్యామిలీని అభిమానించేవారికి, వంగవీటి రాధా కృష్ణ పెళ్లి ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్నవారికి శుభవార్త.. ఎందుకంటే.. వంగవీటి ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి.. ఇప్పటికే రెండు కుటుంబాలు పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్‌ చేసుకున్నాయి..

Read Also: Cinema At Manipur: మణిపూర్‌లో 23 ఏళ్ల తరువాత.. హిందీ సినిమా ప్రదర్శన

మొదట ఈ నెల 19వ తేదీన వంగవీటి రాధా-జక్కం పుష్పవల్లీల నిశ్చితార్థం ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.. కానీ, పలు కారణాల వల్ల ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది.. పెళ్లి మాత్రం ముందుగా నిర్ణయించిన మూహూర్తానికి అంటే సెప్టెంబర్‌ 6న జరిపించనున్నారు.. వంగవీటి ఫ్యామిలీ అంటే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం.. ఆ ఫ్యామిలీతో వియ్యం అందుకునేది ఎవరు? అనే చర్చ ఆసక్తికరంగా సాగుతుంది.. అయితే, వంగవీటి రాధాకు కాబోయే భార్య.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురంకు చెందిన అమ్మాయి. నర్సాపురం పట్టణానికి చెందిన యువతితో రాధాకృష్ణకు వివాహం నిర్ణయించారు. తన మిత్రుడికి దగ్గర బంధువుల అమ్మాయితో ఈ వివాహం నిశ్చయం అయినట్లుగా తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు.. నరసాపురం మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్‌ జక్కం ఆమ్మాణి, బాబ్జీల చిన్నకుమార్తె జక్కం పుష్పవల్లీ.. ఇప్పటికే రెండు కుటుంబాలు పెళ్లి విషయంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.. ముహూర్తం కూడా ఫిక్స్‌ చేసుకున్నారని చెబుతున్నారు.

Read Also: Mancherial: శరణ్య హత్య కేసులో ట్విస్ట్‌.. బయట పడ్డ భర్త ఆడియో..!

మొదట నర్సాపురంలో ఈ నెల 19వ తేదీన వధువ ఇంట నిశ్చితార్థం నిర్వహించి.. సెప్టెంబర్‌ 6వ తేదీన విజయవాడలో పెళ్లి జరిపించాలనుకున్నారు.. కానీ, పలు కారణాలవల్ల రాధా నిశ్చితార్థం రద్దు చేసుకున్నారట.. సెప్టెంబర్ 6వ తేదీన నేరుగా వివాహానికి సిద్ధమయ్యారు.. బెజవాడలో వంగవీటి రాధా-పుష్పవల్లీ వివాహం ఘనంగా నిర్వహించాలన వంగవీటి ఫ్యామిలీ ఏర్పాట్లలో మునిగిపోయిందట.. ఇక, ఇటీవల ప్రధాన అనుచరులతో భేటీ కూడా ఇదే విషయం చెప్పటానికి ఓ సమావేశం ఏర్పాటు చేశారట వంగవీటి రాధా.. ఈ సమాచారం మీడియా వరకు వెళ్లడంతో.. సమావేశం రద్దు చేసి.. ఆత్మీయులకు మాత్రమే వివాహ విషయం తెలిపారట రాధా సన్నిహితులు. మొత్తంగా వంగవీటి ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. పార్టీలకు అతీతంగా వంగవీటి ఫ్యామిలీకి అభిమానులు ఉన్నారు.. వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు ఈ పెళ్లికి హాజరయ్యే అవకాశం లేకపోలేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • tdp
  • Vangaveeti Radha Krishna
  • Vangaveeti Radha Krishna Marriage
  • vijayawada
  • YSRCP

తాజావార్తలు

  • New Railway Line: తెలంగాణ, ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైల్వే ప్రాజెక్ట్‌పై అప్‌డేట్..

  • Avesh Khan అత్యుత్సాహం.. ఒక మ్యాచ్ నిషేధం తప్పదా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే.?

  • Riniki Bhuyan Sarma: అస్సాం ముఖ్యమంత్రి భార్య ఎవరో తెలుసా?

  • US-Iran Plan: అలా అయితే హార్ముజ్ ఓపెన్ చేయం.. సంధిపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు..

  • Rajamouli: జక్కన్న మామూలోడు కాదు.. ఏకంగా VFX స్టూడియో సెటప్!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions