మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు. తాను సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకు తీర్పును నిలిపివేయాలని పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు రిజర్వ్ చేసింది. 2018 ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ లో తన భార్య పేరున ఉన్న ఆస్తులు, కేసుల వివరాలను సమర్పించలేదని వనమా వెంకటేశ్వరావుపై మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు 2019లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన తెలంగాణ హైకోర్టు ఈనెల 25న కీలక తీర్పును ఇచ్చింది. అంతేకాకుండా వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటేసింది. 2018 నుండి ఎమ్మెల్యేగా జలగం వెంకటరావు కొనసాగుతారని న్యాయస్థానం తెలిపింది.
Krishna Gadu Ante Oka Range: దిల్ రాజు చేతుల మీదుగా `కృష్ణగాడు అంటే ఒక రేంజ్` ట్రైలర్ లాంచ్
మరోవైపు కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు సీఈవో వికాస్ రాజ్ ను కలిశారు. హైకోర్టు జడ్జ్ మెంట్ ను అమలు చేయాలని ఆయన తెలిపారు. సాయంత్రం హైకోర్టు తీర్పు కాపీని సీఈవోకు జలగం అందజేసారు. ఇవాళ ఉదయం తెలంగాణ హైకోర్టు నిర్ణయం పత్రాన్ని అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీకి అందజేశారు.
Polavaram Project: పోలవరం, ఇతర ప్రాజెక్టులపై సీఎస్ సమీక్ష.. నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి..
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుండి వనమా వెంకటేశ్వరరావు పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎమ్మెల్యే జలగం వెంకటరావు బరిలోకి దిగాడు. ఈ ఎన్నికల్లో జలగం వెంకటరావుపై వనమా వెంకటేశ్వరరావు 4 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. ఆ తర్వాత పరిణామాల్లో వనమా వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ లో చేరారు. ఆయన బీఆర్ఎస్ లో చేరడంతో జలగం వెంకటరావు.. ఆ పార్టీకి కొంత దూరంగా ఉంటున్నారు. అయితే మొదటినుండి బీఆర్ఎస్ లోనే కొనసాగిన విషయాన్ని జలగం వెంకట్ రావు గుర్తు చేశారు. రానున్న రోజుల్లో కూడ బీఆర్ఎస్ లో కొనసాగుతానని ఆయన ప్రకటించారు.