బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక నటించిన ‘ఛావా’ ఫిబ్రవరి 14వ తేదీన విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకుంది. సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి 200 కోట్ల కలెక్షన్స్ దిశగా పరుగులుపెడుతోంది. మరాఠా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్, ఆయన భార్య ఏసు భాయి పాత్రలో రష్మిక మందన్న నటనకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.
Baapu Review in Telugu: బాపు సినిమా రివ్యూ – రేటింగ్.. బ్రహ్మాజీ సినిమా ఎలా ఉందంటే?
అయితే ఈ సినిమాలోని “ఆయా రే తూఫాన్” పాటకి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే కొంచెం భిన్నంగా ఉన్న ఈ గొంతు ఎవరిదా అని ఆరా తీస్తే మరాఠీ సింగర్ వైశాలి సామంత్ పాడినట్టు తెలుస్తోంది. ఈ పాటను సినిమాకి సంగీతం అందించిన ఏ. ఆర్.రెహమాన్ స్వరపరచగా వైశాలి తనదైన టిపికల్ వాయిస్ తో పాటను మరింత ఆసక్తి పెంచేలా మార్చింది. రెండు వారాల క్రితమే రిలీజ్ అయిన ఈ సాంగ్ ఇప్పటికీ ట్రేండింగ్ లోనే ఉంది. ఇక ఈ పాట పాడిన వైశాలి ఆడియో లాంచ్ సందర్భంగా ఏఆర్ రెహమాన్ తో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం ఒక గొప్ప అవకాశమని చెప్పుకొచ్చింది.