Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ.. 14 ఏళ్ల వయసులోనే ప్రపంచ రికార్డులను కొల్లగొడుతూ.. క్రికెట్ చరిత్రలో తన కంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకుంటున్నాడు. 2026 అండర్-19 ప్రపంచ కప్ మొదటి మ్యాచ్‌లో విఫలమైన తర్వాత, వైభవ్‌పై లేవనెత్తిన ప్రశ్నలకు మనోడు దిమ్మతిరిగే సమాధానంతో స్పందించాడు. టోర్నమెంట్లో టీమిండియా రెండవ మ్యాచ్‌లో వైభవ్ తుఫాను హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఈ టోర్నమెంట్లో వైభవ్ అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించడమే కాకుండా, ప్రపంచ కప్ చరిత్రలో 50 పరుగుల మార్కును చేరుకున్న అతి పిన్న వయస్కుడైన బ్యాట్స్‌మన్‌గా కూడా నిలిచాడు.
READ ALSO: BMC Results: ముంబైలో “రిసార్ట్” పాలిటిక్స్.. స్టార్ హోటల్లో షిండే సేన కార్పొరేటర్లు..
బులవాయోలో శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో, టీమిండియా ముందుగా బ్యాటింగ్‌కు దిగి మూడో ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే వైభవ్ సూర్యవంశీ మైదానం ప్రత్యర్థి బౌలర్లకు ఎదురు నిలబడి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 13వ ఓవర్లో వైభవ్ సూర్యవంశీ నయా చరిత్ర సృష్టించాడు. 13వ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీయడం ద్వారా వైభవ్ ఈ మ్యాచ్‌లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ అండర్-19 ప్రపంచ కప్‌లో తన తొలి అర్ధ సెంచరీని పూర్తి చేసుకోవడంతో పాటు ఒక రికార్డును కూడా సృష్టించాడు. అతను కేవలం 30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో ఈ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. ఇది ఈ ప్రపంచ కప్‌లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ. అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో ఆఫ్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ నిలిచాడు. వైభవ్ కేవలం 14 సంవత్సరాల 296 రోజుల వయసులోనే ఈ రికార్డును సాధించాడు. గతంలో ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన షాహిదుల్లా కమల్ (15 సంవత్సరాలు, 19 రోజులు) పేరిట ఉన్న ఈ రికార్డును సూర్యవంశీ బద్దలు కొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో వైభవ్ తన సెంచరీని పూర్తి చేయలేకపోయాడు. వైభవ్ 67 బంతుల్లో 72 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇందులో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.
READ ALSO: FASTag Mandatory: “ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్.. ఫాస్టాగ్ లేకపోతే బండి కదలదు!”