BMC Results: ముంబైలో “రిసార్ట్” పాలిటిక్స్.. స్టార్ హోటల్‌లో షిండే సేన కార్పొరేటర్లు..
- ముంబైలో మొదలైన ‘‘రిసార్ట్’’ పాలిటిక్స్..
- ఫైవ్ స్టార్ హోటల్‌కి షిండే శివసేన కార్పొరేటర్లు..
- క్యాంప్ పాలిటిక్స్ వెనక రెండు కారణాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BMC Results: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ+శివసేన(షిండే) కూటమి సంచలన విజయం సాధించింది. గత రెండు దశాబ్ధాలుగా నగరంపై ఉన్న ఠాక్రేల ఆధిపత్యాన్ని కూల్చేసింది. అయితే, ఇప్పుడు ముంబైలో ‘‘రిసార్ట్’’ రాజకీయాలు మొదలయ్యాయి. ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా నిలిచిన షిండే శివసేన తన కార్పొరేటర్లను ముంబైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌కు తరలించడం ప్రారంభించింది. దేశంలోనే అత్యంత ధనిక పౌరసంస్థ అయిన ముంబైలో కొత్త పాలక వర్గం కొలువుదీరే ముందు రాజకీయాలు మొదలయ్యాయి.
ఈ రిసార్ట్ పాలిటిక్స్ ముందు రెండు ప్రధాన కోణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీలు ఏకమయ్యే అవకాశం ఉన్నందున షిండే ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా, మరో కారణం ఏంటంటే.. మేయర్ పదవిని తామే సొంతం చేసుకునే యోచనలో షిండే ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో బేరసారాలను నడిపించేందుకు తన కార్పొరేటర్లను హోటల్‌కు తరలిస్తున్నట్లు సమచారం.
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్‌కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
బీఎంసీ లెక్కలు ఇవే:
227 స్థానాలు ఉన్న ముంబైలో మెజారిటీ మార్క్ 114. బీజేపీ 89 స్థానాలు సాధించగా, షిండే శివసేన 29 స్థానాల్లో గెలిచింది. ఈ రెండు పార్టీలు కలిస్తే మొత్తం సంఖ్య 118, ఇది మెజారిటీ మార్కును సులభంగా దాటుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో ఉన్నప్పటికీ, ముంబై ఎన్నికల్లో మాత్రం అజిత్ పవార్ ఎన్సీపీ సింగిల్‌గా పోటీ చేసింది. మూడు స్థానాలు గెలుచుకుంది.
ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన యూబీటీ 65 స్థానాల్లో గెలుపొందింది. రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్ 6 స్థానాలు గెలుచుకుంది. వీరిద్దరి బలం 72గా ఉంది. కాంగ్రెస్ 24, ఎంఐఎం 08, సమాజ్‌వాదీ పార్టీ 02 స్థానాల్లో విజయం సాధించాయి. ప్రతిపక్షాల మొత్తం బలం 106గా ఉంది. మరో 08 మంది తోడైతే బీఎంసీని కైవసం చేసుకునే అవకాశం ఉంది. అయితే, ఇక్కడే ఫిరాయింపుల భయం తలెత్తుతోంది. ప్రతిపక్షాల వైపు 08 మంది వెళ్తే బీజేపీ ఆశలు ఆవిరయ్యే అవకాశం ఉంది.
ఎన్డీయే కూటమిలో జూనియర్ భాగస్వామిగా ఉన్న షిండే శివసేన ముంబై మేయర్ పదవిపై కన్నేసింది. బీజేపీతో తమ బేరసారాల శక్తిని పెంచుకోవాలని చూస్తోంది. దీంతోనే రిసార్ట్ పాలిటిక్స్‌కు తెర తీసింది. మేయర్ పదవి శివసేనను వరించేలా షిండే టీమ్ కోరుకుంటోంది. మేయర్ పదవిపై రాజీ పడొద్దని పలువురు కార్పొరేటర్లు షిండేపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలకు 25 ఏళ్ల ముందు వరకు అవిభక్త శివసేననే ముంబైలో అధికారంలో ఉంది. ఇప్పుడు బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అన్ని లెక్కలు దాదాపుగా పూర్తయితే బీఎంసీ పీఠంపై బీజేపీ మేయర్ ఉండే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!