Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (RR) 15 ఏళ్ల వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుపై అతను ఆడిన ఇన్నింగ్స్‌లు క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశాయి. తొలి మ్యాచ్‌లో డకౌట్ అయినప్పటికీ.. ఆ తర్వాత సన్‌రైజర్స్‌తో జరిగిన తదుపరి రెండు మ్యాచ్‌ల్లో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ, 29 బంతుల్లో 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు.
సూర్యవంశీ బ్యాటింగ్‌పై సన్‌రైజర్స్ స్టార్, ఇంగ్లాండ్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ ప్రశంసల వర్షం కురిపించాడు. తాను తన కెరీర్లో ఇలాంటి బ్యాటర్‌ను ఎప్పుడూ చూడలేదంటూ సూర్యవంశీ టైమింగ్, డెవలప్మెంట్ను కొనియాడాడు.
Also Read
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
- RCB Player: ‘ఆర్సీబీకి ఆడాలని నాకు లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్..
- Suryakumar Yadav-MI: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్‌బై?.. ఇదే ప్రూఫ్!
“మేము ‘సూర్యవంశీ’ వేగానికి బలయ్యాం. ఓ మై గాడ్! టోర్నమెంట్ ప్రారంభంలో అతడిని బౌన్సర్లతో త్వరగానే అవుట్ చేశాం. కానీ ఆ తర్వాత అతను మాపైనే ఒక సెంచరీ, ఒక 97 పరుగులు బాదాడు.”
— ‘స్టిక్ టు క్రికెట్’ పాడ్‌కాస్ట్‌లో లివింగ్‌స్టోన్
లివింగ్‌స్టోన్ మాట్లాడుతూ.. “నేను ఇప్పటివరకు ఏడు ఐపీఎల్ సీజన్లు ఆడాను. ఎంతోమంది గొప్ప ఆటగాళ్లతో, వారిపై ఆడాను. కానీ ఇలాంటి విన్యాసాన్ని ఎప్పుడూ చూడలేదు. అతను బంతిని హిట్ చేసే విధానం చాలా క్లీన్‌గా ఉంటుంది. టోర్నమెంట్ మొత్తం మీద అతను ఒక్క బంతిని కూడా మిస్-హిట్ చేయలేదు. టోర్నమెంట్ ప్రారంభం నుండి చివరి వరకు ఒక ప్లేయర్‌గా అతను సాధించిన ఎదుగుదల అద్భుతం. మేము బౌన్సర్లు వేస్తే థర్డ్-మన్ మీదుగా సిక్సర్లు కొట్టాడు, లో-ఫుల్ టాస్ వేస్తే ఫ్లిక్ చేస్తూ బౌండరీలు దాటించాడు” అని వివరించాడు.
రికార్డుల వేట.. ఐపీఎల్ 2026 హీరో..
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్‌ను అత్యంత అద్భుతంగా ముగించాడు. అతను ఆడిన 16 మ్యాచ్‌ల్లో ఏకంగా 237 పైగా స్ట్రైక్-రేట్‌తో 776 పరుగులు సాధించాడు. ఒకే ఐపీఎల్ సీజన్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో సూర్యవంశీ ఐదో స్థానంలో నిలిచాడు. అంతేకాదు, ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొడుతూ.. ఏకంగా 72 సిక్సర్లు బాదాడు.
ఈ అసాధారణ ప్రదర్శనకు గాను, ఐపీఎల్ 2026 ఫైనల్ ముగిసిన తర్వాత ప్రెజెంటేషన్‌లో సూర్యవంశీ ఏకంగా ఐదు అవార్డులను కైవసం చేసుకున్నాడు. ఇందులో అత్యధిక పరుగులు చేసినందుకు ఇచ్చే ‘ఆరెంజ్ క్యాప్’ తో పాటు ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ (MVP) అవార్డు కూడా ఉన్నాయి.
మరోవైపు.. ఈ సీజన్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 13 కోట్లకు కొనుగోలు చేసిన స్టార్ ప్లేయర్ లియామ్ లివింగ్‌స్టోన్ మాత్రం కేవలం రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కించుకున్నాడు. సూర్యవంశీ ఆటతీరు చూస్తుంటే.. సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ‘అతి పిన్న వయస్కుడైన భారత ఆటగాడి’ రికార్డును బద్దలు కొట్టేలా ఉన్నాడని బీసీసీఐ వర్గాల అంచనా.
తాజావార్తలు
-
Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
-
Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!