RCB Player: ‘ఆర్సీబీకి ఆడాలని నాకు లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు వరుసగా రెండు సార్లు ఐపీఎల్ (IPL 2026) ట్రోఫీలను అందించి, ఆ ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచిన రజత్ పాటిదార్ ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. మొదట్లో తనకు ఆర్సీబీ జట్టులో చేరడం అస్సలు ఇష్టం లేదని ఆయన పేర్కొన్నారు. ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ఆ సమయంలో తన మనసులోని ఆందోళనలను పంచుకున్నారు.
2021లో ఆర్సీబీ తరపున ఆడిన పాటిదార్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఆ తర్వాత 2022 మెగా వేలంలో ఏ జట్టూ అతనిని కొనుగోలు చేయలేదు. అయితే, అదే సీజన్ మధ్యలో లవ్నిత్ సిసోడియాకు రిప్లేస్మెంట్ ఆటగాడిగా ఆర్సీబీ నుండి ఆయనకు పిలుపు వచ్చింది. కానీ, ఆ సమయంలో జట్టులోకి వెళ్లడానికి ఆయన వెనుకాడారు. కేవలం ఒకరి స్థానంలో వెళ్తున్నప్పుడు తనకు ఆడే అవకాశం దక్కుతుందో లేదో అన్న అనుమానం ఆయనకు బలంగా ఉండేది. పైగా, క్యాంప్‌కు వెళ్లిన తర్వాత కూడా “నువ్వు రిప్లేస్మెంట్ ప్లేయర్‌వి మాత్రమే, ఎవరికైనా గాయాలైతేనే అవకాశం వస్తుంది, కాబట్టి రిలాక్స్‌గా ఉండు” అని మేనేజ్మెంట్ చెప్పడంతో ఆయన మరింత నిరాశకు గురయ్యారు.
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
దీనికి తోడు అదే సమయంలో రజత్ పాటిదార్ వివాహ ముహూర్తం కూడా ఖరారైంది. కేవలం బెంచ్‌కే పరిమితం కావడానికి పెళ్లిని వాయిదా వేసుకోవడం ఎందుకనే ఉద్దేశంతో, ఆర్సీబీ పిలుపును తిరస్కరించాలని ఆయన గట్టిగా అనుకున్నారు. కానీ, చివరకు జట్టులో చేరిన పాటిదార్.. లక్నో సూపర్ జయంట్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 112 పరుగులతో అద్భుత సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
🔴 HONESTLY, I DIDN’T WANT TO JOIN RCB – SHOCKING STATEMENT BY RAJAT PATIDAR 🤯
🎙️: I didn’t really want to rejoin RCB because I was told I was coming in as a replacement and would only get a chance if someone got injured. My wedding date was already fixed, and I don’t see… pic.twitter.com/Bc3ys3Txzc
— Sam (@cricsam02) June 7, 2026
ఆ ఒక్క ఇన్నింగ్స్ ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. 2025 మెగా వేలం తర్వాత ఆర్సీబీ మేనేజ్మెంట్ ఆయనకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. ఎన్నో ఏళ్లుగా ఆర్సీబీ అభిమానులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ కప్పును అందించడమే కాకుండా, వరుసగా రెండో ఏడాది కూడా జట్టును చాంపియన్‌గా నిలిపి పాటిదార్ చరిత్ర సృష్టించారు. నాడు బెంచ్‌కే పరిమితం అవుతానేమో అని భయపడిన ఒక సాధారణ ఆటగాడు, నేడు అదే ఫ్రాంచైజీని విజయపథంలో నడిపించే స్థాయికి చేరడం నిజంగా విశేషం.
తాజావార్తలు
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
-
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!