IND vs ENG: బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న రెండవ టెస్టు మ్యాచ్ లో భారత్ విజయానికి చాలా దగ్గరలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా 587 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (269), యశస్వి జైస్వాల్ (87), జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) ఆకట్టుకున్నారు. గిల్ డబుల్ సెంచరీతో రికార్డులను బద్దలు కొట్టాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో బషీర్ 3, టంగ్ 2, వోక్స్ 2 వికెట్లు తీశారు.
Read Also:Elon Musk: ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం.. కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన
ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 407 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ 6 వికెట్లు, ఆకాష్ దీప్ 4 వికెట్లు తీసి ఇంగ్లండ్ బ్యాటింగ్‌ను నేలకూల్చారు. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో మొత్తం ఆరుగురు డకౌట్ అయినా హ్యారీ బ్రుక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) లతో మాత్రమే ఆ మాత్రం స్కోరును అందుకుంది. ఇక ఆ తర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్ ను బీస్ట్ మోడ్ లో మొదలు పెట్టింది. అది ఎంతలా అంటే 83 ఓవర్లలో 427/6 వద్ద డిక్లేర్ ఇచ్చేంతలా.
Read Also:PM Narendra Modi: బ్రెజిల్ చేరుకున్న ప్రధాని మోడీ.. 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరకానున్నారు
ఇక రెండో ఇన్నింగ్స్ లో మరోసారి కెప్టెన్ గిల్ (161) తో రాణించగా.. పంత్ (65), జడేజా (69*) రాణించారు. దీనితో భారత్ ఇంగ్లండ్ ముందర 608 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇక భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే కష్టాల్లో పడింది. నాలగవ రోజు ముగిసే సమయానికి 16 ఓవర్లలో 72 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది. ఈ మూడు వికెట్లను ఆకాష్ దీప్ 2, సిరాజ్ 1 వికెట్ తీశారు. ప్రస్తుతం ఒల్లీ పోప్ (24), హ్యారీ బ్రుక్ (15) పరుగులతో క్రీజులో ఉన్నారు. దీనితో చివరిరోజు ఇంగ్లండ్ ఇంకా 536 పరుగులు చేయాల్సి ఉంది. ఇంగ్లండ్‌కు విజయమే కాకుండా మ్యాచ్‌ను డ్రా చేయడం సైతం కష్టమైన పని అనే చెప్పవచ్చు. మరోవైపు భారత్ బర్మింగ్‌హామ్ లో తన మొదటి టెస్ట్ విజయం కోసం కేవలం 7 వికెట్లు నేలకూల్చితే చాలు. ఈ నేపథ్యంలో భారత్ విజయం సాధించడం లాంఛనంగా మిగిలిందని చెప్పవచ్చు.