Vaibhav Sooryavanshi: అర్ధరాత్రి 2 గంటలకు గదిలో లేని వైభవ్.. టెన్షన్ పడిపోయిన బుడ్డోడి తల్లి!
- ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు
- కఠోర శ్రమ, అంకితభావం, పట్టుదల కూడా తోడవ్వాలి
- అర్ధరాత్రి 2 గంటలకు బుడ్డోడు ప్రాక్టీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Secret Behind Vaibhav Sooryavanshi’s Rise: క్రీడల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు. అందుకు కఠోర శ్రమ, అంకితభావం, పట్టుదల కూడా తోడవ్వాలి. ఈ విషయంలో భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అందరికంటే ముందున్నాడు. బుడ్డోడి పట్టుదల గురించి అతడి తల్లి ఆర్తి సూర్యవంశీ స్వయంగా చెప్పారు. అర్ధరాత్రి 2 గంటలకు బుడ్డోడు ప్రాక్టీస్ చేస్తున్నాడట. ఆ పట్టుదల భారత జట్టులోకి వచ్చేందుకు వైభవ్ ఎంతలా కష్టపడుతున్నాడో స్పష్టం చేస్తోంది.
ఒక రోజు తెల్లవారుజామున 2 గంటల సమయంలో వైభవ్ సూర్యవంశీ తల్లి ఆర్తి నిద్రలేచారు. ఉదయాన్నే ప్రాక్టీస్‌కు వెళ్లే తన కుమారుడికి ఇష్టమైన ఆహారం తయారు చేయాలని అందుకున్నారు. వంటగదికి వెళ్లే ముందు ఆమె వైభవ్ గదిలోకి వెళ్లారు. అయితే అక్కడ బుడ్డోడు కనిపించకపోవడంతో ఆమె ఒక్కసారిగా టెన్షన్ పడిపోయారు. అర్ధరాత్రి సమయంలో కుమారుడు గదిలో లేకపోవడంతో తెగ కంగారుపడ్డారు. ఎక్కడికి వెళ్లాడో తెలియక ఇంటి బయటకు వచ్చి వెతకసాగారు. ఆ సమయంలో బయట కనిపించిన దృశ్యం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది.
Also Read
- FIFA World Cup 2026: 16 ఏళ్ల తర్వాత తొలి విజయం.. చెక్ రిపబ్లిక్ పై 'దక్షిణ కొరియా' సంచలన విజయం.!
- Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
- 2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే 'సరైనోడు'!
- IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
వైభవ్ సూర్యవంశీ చేతిలో బ్యాట్ పట్టుకుని బ్యాటింగ్ సాధన చేస్తున్నాడు. సమయం రాత్రి 2 గంటలు దాటినా.. అతడు విశ్రాంతి గురించి ఆలోచించకుండా తన ఆటను మరింత మెరుగుపర్చుకునేందుకు శ్రమిస్తున్నాడు. లోకమంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో కూడా తన లక్ష్యాన్ని చేరుకోవాలనే సంకల్పంతో సాధన కొనసాగించాడు. ఈ సంఘటన వైభవ్ విజయాల వెనుక ఉన్న అంకితభావాన్ని తెలియజేస్తోంది. సాధారణంగా విజయం అదృష్టం వల్ల వస్తుందని చాలా మంది భావిస్తారు. కానీ విజయవంతమైన క్రీడాకారుల జీవితాలను పరిశీలిస్తే.. ప్రతి విజయానికి వెనుక ఎన్నో గంటల సాధన, త్యాగం, క్రమశిక్షణ దాగి ఉంటాయి.
ప్రపంచ స్థాయి క్రీడాకారుల ప్రయాణాల్లో కనిపించే ఈ లక్షణాలే వారిని ప్రత్యేకంగా నిలబెడతాయి. వైభవ్ సూర్యవంశీ అర్ధరాత్రి చేసిన సాధన యువతకు స్ఫూర్తిదాయకంగా మారింది. లక్ష్యంపై నమ్మకం, నిరంతర శ్రమ, అంకితభావం ఉంటే అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయవచ్చనే సందేశాన్ని ఈ ఘటన తెలియజేస్తోంది. అసలైన విజయం యాదృచ్ఛికంగా రాదు. దాని వెనుక నిరంతర కృషి, పట్టుదల, త్యాగం ఉంటాయి. వైభవ్ కథ అందుకు నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తోంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అర్ధరాత్రి 2 గంటలకు గదిలో లేని వైభవ్.. టెన్షన్ పడిపోయిన బుడ్డోడి తల్లి!
-
FIFA World Cup 2026: 16 ఏళ్ల తర్వాత తొలి విజయం.. చెక్ రిపబ్లిక్ పై ‘దక్షిణ కొరియా’ సంచలన విజయం.!
-
Sing Geetham Review : సింగ్ గీతం రివ్యూ.. సింగీతం ప్రయోగం ఎలా ఉందంటే?
-
SPIRIT : ప్రభాస్ కోసం అసలు సిసలైన డ్యూటీ చేస్తున్న సందీప్ రెడ్డి
-
Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
ట్రెండింగ్
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!