Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petrol Diesel Purchase: మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ సరఫరాకు సంబంధించి ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశంలోని సాధారణ పెట్రోల్ బంకుల నుంచి భారీ మొత్తంలో ఇండస్ట్రియల్ పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడంపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం.. పారిశ్రామిక, వాణిజ్య, సంస్థాగత వినియోగదారులు (ఇండస్ట్రియల్ & కమర్షియల్ యూజర్స్) ఇకపై రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి వీల్లేదు. వారు తమ అవసరాల కోసం కేవలం బల్క్ సేల్ పాయింట్ల (థోక్ విక్రయ కేంద్రాల) పైనే ఆధారపడాల్సి ఉంటుంది.
ప్రభుత్వం విధించిన ఈ ఆంక్షలు ప్రాథమికంగా 90 రోజుల పాటు అమలులో ఉంటాయి. అయితే, పరిస్థితులను బట్టి ఈ గడువును మరింత పొడిగించే అవకాశం కూడా ఉంది. కొన్ని ప్రాంతాలలో డీజిల్ డిమాండ్ అసాధారణంగా పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని నివేదికలు చెబుతున్నాయి. రిటైల్ బంకుల్లో, బల్క్ మార్కెట్లో ధరల మధ్య ఉన్న భారీ వ్యత్యాసం కారణంగా.. పారిశ్రామిక వినియోగదారులు బల్క్ పాయింట్లను వదిలేసి సాధారణ పెట్రోల్ బంకుల నుంచి ఇంధనాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఫిబ్రవరి చివర్లో మిడిల్ ఈస్ట్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగినప్పటికీ, సాధారణ ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రిటైల్ ధరలను నియంత్రణలో ఉంచాయి. దీనివల్ల టెలికాం టవర్లు, విద్యుత్ ఉత్పత్తి, ఇతర పరిశ్రమలకు మార్కెట్ ధర (బల్క్ ప్రైస్) వర్తిస్తుండగా, రిటైల్ బంకుల్లో ధరలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. ఈ తేడాను వాడుకుని పరిశ్రమలు బంకులపై పడటంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది.
Also Read
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జూన్ 11న ‘మోటార్ స్పిరిట్, హై స్పీడ్ డీజిల్ (రిటైల్ అవుట్లెట్ల ద్వారా సరఫరా తాత్కాలిక నియంత్రణ) ఉత్తర్వులు, 2026’ను జారీ చేసింది. ప్రస్తుత అంతర్జాతీయ భౌగోళిక-రాజకీయ పరిస్థితుల (జియోపాలిటికల్ టెన్షన్స్) వల్ల ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థ, షిప్పింగ్ లాజిస్టిక్స్, పెట్రోలియం ఉత్పత్తుల లభ్యతపై తీవ్ర ప్రభావం పడిందని ప్రభుత్వం వివరించింది. ఇలాంటి సమయంలో పారిశ్రామిక రంగాలు రిటైల్ బంకుల నుంచి భారీగా ఇంధనాన్ని తరలిస్తే, అది సామాన్య వినియోగదారులకు అందకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల స్థానికంగా ఇంధన కొరత ఏర్పడి, సామాన్యుడికి అవసరమైన నిత్యావసర సేవలకు అంతరాయం కలిగే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఈ కొత్త నోటిఫికేషన్ ప్రకారం.. రిటైల్ పెట్రోల్ బంకుల్లో డీజిల్ విక్రయాలను కేవలం వాహనాల ఇంధన ట్యాంకులకు లేదా పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (PESO) అనుమతించిన కంటైనర్లకు మాత్రమే పరిమితం చేశారు. ఇందులో కూడా ఒక కస్టమర్ లేదా ఒక వాహనానికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల కొనుగోలు పరిమితిని (లిమిట్) విధించారు. ఇంధన నిల్వలు పెరిగిపోకుండా, కృత్రిమ కొరత సృష్టించకుండా (బ్లాక్ మార్కెట్ నివారణకు) మోడీ ప్రభుత్వం ఈ గట్టి చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ అందరికీ సమానంగా అందుబాటులో ఉండేలా చూడటం, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం, నిరంతరాయంగా సరఫరాను కొనసాగించడమే దీని ముఖ్య ఉద్దేశం.
తాజావార్తలు
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!