Nagari Politics: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.. మంత్రి ఆర్కే రోజా ప్రాతినిథ్యం వహిస్తోన్న నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో.. రోజాను వ్యతిరేకిస్తున్న కొందరు నేతలు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. తెలుగుదేశం పార్టీలో చేరగా.. మరోవైపు.. పార్టీలోనే ఉంటూ.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ.. మంత్రి రోజాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నవారిపై చర్యలకు పూనుకుంది వైసీపీ.. ఇప్పుడు నగరిలో వ్యతిరేక వర్గానికి షాక్ ఇచ్చింది మంత్రి ఆర్కే రోజా.. వడమాలపేట జెడ్పీటీసీ మురళీ రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు భరత్.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడినట్లు ఫిర్యాదు అదడంతో చర్యలకు పూనుకున్నట్టు పేర్కొన్నారు.
Read Also: CM Revanth Reddy: నేడు కొమురం భీం, సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
అయితే, ఇంతకాలం పార్టీని నమ్ముకుని ఉన్నందుకు ఇలాంటి పని చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మురళీరెడ్డి.. మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడుగా ముద్రపడిన మురళీరెడ్డిపై వేటు వేయడంతో జిల్లా రాజకీయాలు హాట్‌హాట్‌గా మారిపోయాయి.. ఇక, మంత్రి రోజా వద్దు.. పార్టీ ముద్దు.. అంటూ నగరిలో రోజా ఓడిపొతుందంటూ ప్రెస్‌మీట్ పెట్టి మరీ బహిరంగంగా వ్యాఖ్యానించారు మురళీరెడ్డి.. ఈ వ్యవహారాన్ని పార్టీ తప్పుబడుతోంది.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నాడనే ఆరోపణలతో మురళీరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాగా, ఏపీలో సార్వత్రిక ఎన్నికలు కాకరేపుతున్నాయి.. ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరగనున్న విషయం విదితమే.