Uttam Kumar Reddy : గత ప్రభుత్వం వల్ల కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం
- కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ నిర్లక్ష్యం – ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలు
- పాలమూరు-రంగారెడ్డి సహా కీలక ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై విపక్షంపై విమర్శలు
- కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల పూర్తి బాధ్యత తీసుకుంటుంది : ఉత్తమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy : గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన బిఆర్ఎస్ నాయకులకు కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన ప్రాజెక్టులను గత పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవము కాదా? అని ఆయన ప్రశ్నించారు. 1.81 లక్షల కొట్లు తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చినా కృష్ణా జలాల విషయంలో అన్యాయం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మంత్రి ఉత్తమ్ ఫైర్ అయ్యారు. వారి హయాంలో కృష్ణా బేసిన్లో ఉన్న ఏ ప్రాజెక్టును కూడా పూర్తి చేయకపోగా నిధులు కేటాయించడంలో కూడా పూర్తి నిర్లక్ష్యం వహించారని, అందువల్ల ప్రతి సంవత్సరం 100 టీఎంసీల నీటిని నిలువ చేసుకునే సామర్థ్యాన్ని దక్షిణ తెలంగాణ ప్రాజెక్ట్ లు కోల్పోవడం జరిగిందన్నారు.
Also Read
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్‌ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
- H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
అంతేకాకుండా..’ నల్గొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ సొరంగము ద్వారా నిండే , రిజర్వాయర్స్ కెపాసిటీ 10 టీఎంసీలు, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ రిజర్వాయర్స్ కెపాసిటీ 25 టిఎంసిలు , పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రిజర్వాయర్స్ కెపాసిటీ 65 టిఎంసిలు. ఈ మూడు ప్రాజెక్టు లే కాకుండా కృష్ణా బేసిన్ లోని వివిధ దశలలో ఉన్న ఇతర ప్రాజెక్టులకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించకుండా పూర్తి నిర్లక్ష్యం వహించి దక్షిణ తెలంగాణలో కరువు పరిస్థితులను తెచ్చింది బీఆర్ఎస్ హయాంలోనే కాదా? గత పది సంవత్సరాల నుండి వివిధ ప్రాజెక్టుల కింద భూసేకరణ కూడా చేయకుండా జరగకుండా నిర్లక్ష్యం వహించింది బి.ఆర్. ఎస్ ప్రభుత్వం కాదా? అందువల్ల ఆ ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు సాగలేదన్న విషయం మీకు తెలియదా? కృష్ణా బేసిన్ లోని కొన్ని ప్రాజెక్ట్ లలో కాలువలు , డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాణం అసంపూర్తిగా ఉన్న విషయం వాస్తవం కాదా ? కృష్ణా బేసిన్ లోని సాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగకపోవడానికి గత పది సంవత్సరాలు పాలించిన ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గార్లు కారణం కాదా? దానిలో అప్పటి జిల్లా మంత్రిగా మీ బాధ్యత లేదా? రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోని మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే మూడు సంవత్సరాలలో కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్ట్ లను అన్నింటిని పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం.’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Fastag : ఫాస్టాగ్ కొత్త నియమాలపై స్పష్టత ఇచ్చిన NHAI.. ఇక వాళ్లకు ఫైన్లు పడవు
తాజావార్తలు
-
Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Bajaj Pulsar: 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎంతగా మారింది? 2001 నాటి 150cc నుంచి కొత్త N160 4V వరకు పూర్తి చరిత్ర ఇదే!
-
DC: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’లో విజయ్ దేవరకొండను తీసుకోవాలనుకున్నారా? అసలు కథ ఇదే!
-
YouTube Movies : రూపాయి ఖర్చు లేకుండా.. యూట్యూబ్‌లో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్స్
-
PhonePe Daily RD: రోజుకు రూ.100తో PhonePe Daily RD.. ఎలా పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేట్లు, పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!