Fastag : తరచూ నేషనల్ హైవేలపై ప్రయాణిస్తుంటే ఈ వారం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఫాస్టాగ్ నిబంధనల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. కొత్త నిబంధనలకు సంబంధించి చాలా గందరగోళం నెలకొంది. ఇప్పుడు వాటి గురించి NHAI స్పష్టత ఇచ్చింది. ఈ నిబంధనలకు సంబంధించి NHAI వివరణ ఇచ్చింది. ఫిబ్రవరి 17 సోమవారం నుండి అమల్లోకి వచ్చిన కొత్త ఫాస్ట్‌ట్యాగ్ నిబంధనల ప్రకారం.. ఫాస్ట్‌ట్యాగ్ బ్లాక్‌లిస్ట్ చేసిన లేదా తగినంత బ్యాలెన్స్ లేని వారికి టోల్ గేట్ వద్ద ఫైన్ విధించబడుతుంది. వారు టోల్ ఛార్జీలో రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నియమానికి సంబంధించి NHAI వివరణ ఇచ్చింది. హైవేపై తరచుగా ప్రయాణించే వారికి పెద్ద ఉపశమనం కలిగించింది.
FASTag కొత్త నియమాలు, నిబంధనల ప్రకారం టోల్ ప్లాజా వద్ద వాహనదారుల అనుభవంలో ఎలాంటి మార్పులను తీసుకొని రాలేదని NHAI స్పష్టం చేసింది. టోల్ గేట్ల వద్ద డిజిటల్ చెల్లింపులను నిర్వహించే బాధ్యతను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్వహిస్తుందని NHAI చెబుతోంది. FASTag వాడకానికి సంబంధించి NPCI జారీ చేసిన మార్గదర్శకాలకు కస్టమర్లతో ఎటువంటి సంబంధం లేదు. ఈ నియమం చెల్లింపు వసూలుకు సంబంధించి బ్యాంకుల మధ్య వివాదాలను పరిష్కారం గురించి మాత్రమే.
Read Also:Manipur: రాష్ట్రపతి పాలన మొదటి వారంలోనే.. మణిపూర్‌లో ఉగ్రవాదులపై భారీ దాడులు..
కొత్త నిబంధనలు టోల్ గేట్ల వద్ద డిజిటల్ లావాదేవీలను సులభంగా పరిష్కరించేలా చూస్తాయని, వినియోగదారులు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా నిర్ణీత సమయంలోపు పూర్తి చేస్తామని NHAI చెబుతోంది. సాధారణ వినియోగదారులు టోల్ బూత్ దాటే ముందు ఎప్పుడైనా తమ ఫాస్ట్ ట్యాగ్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చని NHAI స్పష్టం చేసింది. దేశంలోని జాతీయ రహదారులపై ఉన్న టోల్ బూత్‌లు ప్రజలకు వారి ఫాస్ట్‌ట్యాగ్ రియల్ టైమ్ స్టేటస్ చూపిస్తాయి. అయితే ఈ ప్రోటోకాల్ కొన్ని రాష్ట్ర రహదారులపై కూడా పనిచేస్తుంది.
అయితే NPCI మార్గదర్శకాలు ఫాస్టాగ్ జారీ చేయడం, చెల్లింపును స్వీకరించడానికి మాత్రమే బ్యాంకుతో సంబంధం ఉంటుంది. దీనివల్ల ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా చేసిన చెల్లింపు బ్యాంకుల మధ్య నిర్ణీత సమయంలోపు పరిష్కరించబడుతుంది. తద్వారా వినియోగదారులు ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. టోల్ బూత్ చేరుకోవడానికి 60 నిమిషాల ముందు యూజర్ ఫాస్ట్ ట్యాగ్ యాక్టివ్ స్టేటస్‌లో లేకుంటే.. టోల్ బూత్ దాటిన 10 నిమిషాలలోపు రీఛార్జ్ చేయకపోతే అతడి నుండి డబుల్ టోల్ వసూలు చేయబడుతుందని కొత్త నిబంధనలు పేర్కొన్నాయి.
Read Also:Madhu Yaskhi Goud : అవినీతి అధికారుల లిస్ట్ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు చేరింది