మనలో చాలామంది ప్రయాణం చేయడానికి ఎక్కువగా రోడ్డు మార్గాలను ఉపయోగిస్తారు. వీలైతే రైలు లేదా ఫ్లైట్స్ ఉపయోగిస్తారు. ఇకపోతే సేఫ్టీ జర్నీ కోసమే అయితే మాత్రం కచ్చితంగా ట్రైన్ జర్నీ ని ప్రేఫర్ చేసేవారు చాలా ఉంది ఎక్కువ. ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించాలన్న, అలాగే ఏదైనా పుణ్యక్షేత్రాలను దర్శించాలన్న కానీ.. కుటుంబంతో కలిసి సురక్షితంగా వెకేషన్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రైలు ప్రయాణానికి ఎక్కువమంది మొగ్గు చూపుతారు. ఇకపోతే ట్రైన్ ఓ రిజర్వేషన్ సీట్స్ బుక్ చేసుకోవాలంటే మాత్రం అది ఈ మధ్య కాలంలో కాస్త కష్టంగానే మారిందని చెప్పవచ్చు. ఇకపోతే అప్పటికప్పుడు ప్రయాణం చేయాలంటే మాత్రం స్టేషన్లోని కౌంటర్ వద్దకు వెళ్లి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా వెళ్ళిన సమయంలో టికెట్ కౌంటర్ వద్ద బారులు తీరి రద్దీ ఉన్న సమయంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి.
Also Read: Payal Rajput : జిగేల్ డ్రెస్సులో పాయల్ హాట్ ట్రీట్.. ఫ్యాన్స్ ఫిదా..
ఈ నేపధ్యంలో ప్రయాణికుల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు రైల్వే శాఖ తాజాగా అన్ రిజర్వ్డ్ టికెట్ బుకింగ్ సిస్టం ( UTS) ను సంబంధించిన యాప్ ను కొత్తగా తీసుకోవచ్చారు. ఇక ఈ యూటీఎస్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేస్కొని.. అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. యాప్ లోకి లాగిన్ అయ్యాక వెంటనే స్క్రీన్ మీద కనిపించే ‘నార్మల్ బుకింగ్’ సెక్షన్లోకి వెళ్లి.. అక్కడ కనిపించే బుక్ అండ్ ట్రావెల్ (పేపర్ లెస్), బుక్ అండ్ ప్రింట్ (పేపర్) అనే ఈ రెండు ఆప్షన్లలో ఏదో ఒకదానిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పేపర్ లెస్ ఆప్షన్ ఎంచుకున్నట్లయితే మొబైల్ లో జీపీఎస్ ఆన్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ప్రయాణం ఎక్కడి నుంచి చేయాలనుకుంటున్నారో ఆ స్టేషన్ సహా వెళ్లాల్సిన స్టేషన్‌ను కూడా ఎంచుకోవాలి.
Also Read: Health Tips : ఎండాకాలంలో కోడిగుడ్లను ఎక్కువగా తింటున్నారా? ఇది మీకోసమే…
ఆ తర్వాత కింద కనిపించే ఆప్షన్లతో మీ ప్రయాణానికి అందుబాటులో ఉన్న ట్రైన్లు, వాటి ఛార్జీలు మనకి కనపడతాయి. అక్కడ చివరగా ‘గెట్ ఫేర్ ‘ పై క్లిక్ చేస్తే.. మనకి నచ్చిన ట్రైన్ పై క్లిక్ చేసి.. టైమ్, ప్లా్ట్‌ఫాం నంబర్, టికెట్ రేటు, ట్రైన్ నంబర్ వంటి వివరాలన్నీ చూపించబడతాయి. ఆ తర్వాత మనం ఎంతమంది ప్రయాణం చేస్తున్నాము, ట్రైన్ ట్రిప్, ఇంకా పేమెంట్ టైప్ ఎంచుకోవాల్సి ఉంటుంది.