వేసవికాలంలో ఏదైన తక్కువగానే తీసుకోవాలి.. ఇష్టం కదా అని ఫుల్ గా లాగిస్తే మాత్రం ఇక ఇబ్బంది పడాల్సిందే.. అందులో మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మాత్రం ఇక అంతే.. అయితే కోడిగుడ్డును తీసుకొనేవారు కొన్ని టిప్స్ ను ఫాలో అయితే మంచిది.. విటమిన్ ఎ, విటమిన్ బి12, విటమిన్ డి, ప్రొటీన్, కాల్షియం, జింక్, ఫోలేట్, ఫాస్పరస్ వంటివి గుడ్డులో ఎక్కువగా ఉంటాయి.. అందుకే ప్రతి రోజూ ఒక గుడ్డును తినాలని వైద్యులు సూచిస్తారు.. సమ్మర్ లో తీసుకోవడం మంచిదేనా ఇప్పుడు తెలుసుకుందాం..
వేసవిలో గుడ్లు అధికంగా తీసుకోవడం మానేయాలి. ఎందుకంటే దాని అధిక వినియోగం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.. మాములుగా గుడ్లు వేడిని కలిగి ఉంటాయి.. వేడిగా ఉన్నప్పుడు వీటిని తీసుకోవడం వల్ల కడుపులో వికారంగా ఉండటం మాత్రమే కాదు.. ఎసిడిటీ, బర్నింగ్ సెన్సేషన్ కూడా అనిపించవచ్చు.. ముఖం పై మొటిమలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి..
అంతేకాదు వేసవిలో గుడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కడుపునొప్పి, అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.. కిడ్నీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. అందుకే.. మితంగా తింటే మంచిది అంటున్నారు.. వీటిని ఎప్పుడు తక్కువగా తీసుకోవాలి.. డైట్ చేసేవారు పచ్చ గుడ్డు లేకుండా తీసుకోవడం మంచిది.. లేకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే అవకాశాలు ఉన్నాయి.. అందుకే ఉదయం మాత్రం ఈ గుడ్డును తీసుకోవడం మంచిది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.