H-1B Visa: హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై సొంత దేశంలోనే వ్యతిరేకత వస్తుంది. తాజాగా అగ్రరాజ్యంలోని 20 రాష్ట్రాలు ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశాయి. ఏ ప్రెసిడెంట్ కి కూడా రాజ్యాంగాన్ని విస్మరించే అధికారం లేదని పేర్కొన్నారు. అయితే, హెచ్-1బీ వీసా ఫీజును పెంచడాన్ని గతంలో అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, 20 రాష్ట్రాలు వేసిన పిటిషన్ కు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా నాయకత్వం వహిస్తున్నారు.
Read Also: Gold And Silver: ఏకంగా రూ. 6 వేలు తగ్గిన వెండి ధర.. బంగారం మాత్రం!
ఇక, ట్రంప్ నిర్ణయించిన రుసుం నిలిపివేయాలి.. వలసల చట్టంతో సహా దాని సంబంధిత ఖర్చులలో కీలక మార్పులు చేసే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని అటార్నీ జనరల్ రాబ్ బోంటా తెలిపారు. హెచ్-1బీ వీసాలపై అదనపు రుసుములు విధించే అధికారం ట్రంప్‌కు లేదన్నారు. కాంగ్రెస్ ఈ వీసా కార్యక్రమాన్ని మెరుగుపరి.. కండిషన్స్, రుసుములు నిర్ణయించింది అన్నారు. అదనపు ఛార్జీలు విధించే అధికారం ట్రంప్ కి ఏమాత్రం లేదు.. ఏ అధ్యక్ష పరిపాలన ఇమిగ్రేషన్ చట్టాన్ని తిరిగి రాయలేదు.. రాజ్యాంగాన్ని, చట్టాలను ఏ ప్రెసిడెంట్ విస్మరించరని తెలియజేశారు.
Read Also: Kusuma Krishnamurthy: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం.. గుండెపోటుతో మాజీ ఎంపీ మృతి..
అయితే, ఈ రుసుం ప్రభుత్వం, ప్రైవేట్ యజమానులపైనా ఆర్థిక భారాన్ని మోపుతుందని బోంటా ఆందోళన వ్యక్తం చేశారు. కీలక రంగాల్లో కార్మికుల కొరత ఏర్పడుతుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే విద్య, ఆరోగ్య సంరక్షణ లాంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన హెచ్-1బీ వీసాదారుల కొరత ఉందన్నారు. ఇది మరింత తీవ్రతరం కానుందన్నారు.