US: పాలస్తీనా అనుకూల నిరసనలపై ఉక్కుపాదం.. 200 మంది అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికా యూనివర్సిటీలు అట్టుడికాయి. విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన అమెరికా పోలీసులు.. నిరసనలపై ఉక్కుపాదం మోపారు. ఎక్కడికక్కడే నిరసనకారులకు సంకెళ్లు బిగించారు. అయితే నిరసనల్లో పాల్గొన్న 200 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కేసులు నమోదు చేసి జైళ్లకు పంపించారు.
ఇది కూడా చదవండి: Kapila Venu: గుడిలో నటికి దారుణ అనుభవం.. ఫిజికల్‌గా టచ్ చేసి?
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
గత కొద్ది రోజులుగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. గాజా పట్టణాన్ని ఇజ్రాయెల్ సర్వనాశనం చేసింది. ఇప్పటికీ యుద్ధం సాగుతోంది. ఈ దాడుల్లో అనేకమంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. దీన్ని నిరసిస్తూ అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అయితే పోలీసులు ఉక్కుపాదం మోపారు. మరోవైపు నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల్ని ఇప్పటికే యూనివర్సిటీల్లోంచి తొలగించాయి. అనేక మంది విద్యార్థులు తమ భవిష్యత్‌ను నాశనం చేసుకున్నారు.
ప్రిన్స్టన్ యూనివర్సిటీలో చదువుతున్న ఒక భారతీయ సంతతికి చెందిన విద్యార్థిని అచింత్య శివలింగన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు క్యాంపస్ ఆవరణలో విద్యార్థుల నేతృత్వంలోని పాలస్తీనా అనుకూల శిబిరం నిరసనలో పాల్గొన్నందుకుగాను ఆమెను యూనివర్శిటీనుంచి నిషేధించారు. లాస్ ఏంజిల్స్, బోస్టన్ మరియు ఆస్టిన్, టెక్సాస్‌లోని విశ్వవిద్యాలయాల్లోగత బుధవారం, గురువారం యూనివర్సిటీల్లో విద్యార్థులు నిరసనలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Lok Sabha Elections 2024: ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఈసీ..
ఇదిలా ఉంటే విద్యార్థులను పోలీస్ అధికారులు అడ్డుకుంటుండగా మధ్యలో జోక్యం చేసుకున్న అమెరికాకు చెందిన ఒక మహిళా ప్రొఫెసర్ కరోలిన్ ఫోహ్లిన్ను నేలపై పడగొట్టారు. అనంతరం చేతికి సంకెళ్లు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది. తాను ప్రొఫెసర్‌ను అని చెప్పినా విడిచిపెట్టలేదు. ఎంతబతిమాలినా వదలేదు.. పైగా ఆమెను మరో పోలీస్ భూమిలోకి నొక్కేశాడు.
గతేడాది అక్టోబర్ నుంచి హమాస్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. హమాస్.. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసింది. అనంతరం ఇజ్రాయెల్ ప్రతీకారంగా గాజా పట్టణాన్ని ధ్వంసం చేసింది. ఏడు నెలల నుంచి విరామం లేకుండా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. భవంతలు నేలమట్టం అయ్యాయి. ఇక గాజాలో34,305కి పైగా పాలస్తీనియన్లు మరణించారు. ఇజ్రాయెల్ అధికారిక లెక్కల ప్రకారం అక్టోబర్ 7న దాదాపు 1,170 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు పేర్కొంది. ఇక హమాస్ కూడా దాదాపు 250 మందిని ఇజ్రాయెలీయులను బందీలుగా పట్టుకుని తీసుకెళ్లింది. వీరిలో 34 మంది చనిపోయినట్లు ఇజ్రాయెల్ భావిస్తోంది.
ఇది కూడా చదవండి: Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు వాహనాలు ఢీ.. ఎనిమిది మృతి
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!