Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకులను మెప్పించే హీరో కార్తీ, దర్శకుడు పి.ఎస్. మిత్రన్ కాంబినేషన్లో గతంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ స్పై థ్రిల్లర్ ‘సర్దార్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ చిత్రానికి సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ రూపుదిద్దుకుంటోంది. మరో పది రోజుల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. దేశం పెను ప్రమాదంలో ఉన్నప్పుడు ఒక రహస్య బ్లాక్ ఆప్స్ మిషన్‌ను పూర్తి చేయడానికి జపనీస్ భాషలో ప్రావీణ్యం ఉన్న నైపుణ్యంగల ఏజెంట్ రంగంలోకి దిగే నేపథ్యంతో కథ సాగుతుంది. పల్లెటూరి సంస్కృతి, డ్రామా నేపధ్యం ఉన్న యువకుడిగా మరియు దేశాన్ని కాపాడే నిగూఢమైన గూఢచారి ‘సర్దార్’ పాత్రలో కార్తీ కనిపిస్తారు.
కార్తీతో తలపడే ప్రతినాయకుడి పాత్రలో ఎస్.జె. సూర్య తనదైన శైలిలో వైవిధ్యమైన, క్రూరమైన నటనతో ఆకట్టుకోనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఎయిర్‌క్రాఫ్ట్ ఛేజింగ్‌లు, గన్ ఫైట్స్ మరియు ఉత్కంఠభరితమైన స్టంట్ సీక్వెన్స్‌లు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో 10 సెప్టెంబర్ 2026న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సాంకేతిక విలువలు, భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకులను ఆద్యంతం అలరించేందుకు సిద్ధమవుతోంది.
Also Read
తాజావార్తలు
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
-
Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!