Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
- అంతులేని యుద్ధాన్ని ముగించండి
- పుతిన్‌కు మోడీ కీలక సందేశం
- ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. యుద్ధానికి ముగింపు పలికేందుకు అన్ని శాంతియుత ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. “అంతులేని యుద్ధం పరిస్థితి నుంచి యుద్ధం ముగిసే దిశగా మనం ముందుకు సాగాలి. ఈ యుద్ధం వీలైనంత త్వరగా ముగియాలన్నదే మానవాళి ఆకాంక్ష” అని మోడీ పేర్కొన్నారు.

Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోడీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. భేటీ అనంతరం ఇరువురు నేతలు సంయుక్త ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఉక్రెయిన్ అంశంపై మనం నిరంతరం చర్చించుకుంటున్నాం. గతసారి మనం కలిసినప్పుడు కూడా మీరు పరిస్థితిని నాకు విపులంగా వివరించారు. ఈ సంక్షోభానికి పరిష్కారం కోసం అన్ని శాంతియుత మార్గాలకు భారత్ మద్దతు ఇస్తోంది” అని మోడీ తెలిపారు. అన్ని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికే భారత్ ప్రాధాన్యం ఇస్తుందని, ఇది మొత్తం మానవాళికి అవసరమని స్పష్టం చేశారు. “ప్రతిరోజూ కొనసాగే యుద్ధం మానవాళిని వెనక్కి నెడుతుంది. అందువల్ల ఘర్షణలను ముగించేందుకు మనం కృషి చేయాలి” అని మోడీ పిలుపునిచ్చారు.
‘ఇది యుద్ధ సమయం కాదు’
2022లో పుతిన్‌తో జరిగిన సమావేశంలో మోడీ చేసిన ‘ఇది యుద్ధ సమయం కాదు’ వ్యాఖ్యను తాజా ప్రకటన మరోసారి గుర్తుచేసింది. అప్పట్లో కూడా రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం దౌత్యం, చర్చల ద్వారానే సాధ్యమని మోడీ స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో జరిగిన చర్చల్లోనూ భారత్ ఇదే వైఖరిని వ్యక్తం చేస్తూ వచ్చింది. ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ పదేపదే సూచించింది.

భారత్ శాశ్వత శాంతికి మద్దతుదారుగా ఉంటుందని మోడీ తెలిపారు. “భారత్ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. ఇది యుద్ధ సమయం కాదు. మానవాళికి ముప్పుగా మారుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన సమయం. అందుకే భారత్ దౌత్యం, చర్చలను విశ్వసిస్తుంది” అని గతంలో మోడీ పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. భారత్ బుద్ధుడి భూమి అని, భారతీయుల ప్రత్యేకతల్లో సానుభూతి కూడా ఒకటని మోడీ అప్పట్లో వివరించారు. యుద్ధానికి బదులు శాంతి మార్గాన్ని అనుసరించాలన్నది బుద్ధుడి బోధనల సారాంశమని పేర్కొన్నారు. తాజాగా కూడా “గాంధీ, బుద్ధుల భూములైన భారత్ ఒకే సందేశాన్ని పంచుకుంటున్నాయి.. అది శాంతి మార్గం” అని మోడీ స్పష్టం చేశారు.
త్వరలో భారత్‌కు పుతిన్
మోడీ-పుతిన్ భేటీకి మరో ప్రాధాన్యం ఉంది. వచ్చే వారం న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సుకు పుతిన్ హాజరుకానున్న నేపథ్యంలో ఈ ద్వైపాక్షిక సమావేశం జరిగింది. దీంతో రష్యా-భారత్ సంబంధాలతో పాటు ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతల మధ్య చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది.
- Tags
- modi
- Putin
- Russia
- ukraine war
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!