Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో ఘనంగా జరిగిన ‘ఐ యామ్ గేమ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేడుకకు స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, హీరో దుల్కర్ సల్మాన్ చేసిన వ్యాఖ్యలు కార్యక్రమానికి సరికొత్త జోష్‌ను తీసుకొచ్చాయి. ముఖ్యంగా వీరిద్దరూ ‘కల్కి’ సీక్వెల్ షూటింగ్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈవెంట్లో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధాన అంశం ‘కల్కి’ ప్రాజెక్ట్. వేదికపై నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘కల్కి’ తర్వాతి షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభమవుతుందో ప్రస్తుతం తనకే స్పష్టత లేదని సరదాగా వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే పూర్తి చేశామని, ప్రభాస్ డేట్స్ ఖాళీ అయ్యి, ఆయన ఫ్రీ అయిన తర్వాతే పూర్తి స్థాయి చిత్రీకరణను మళ్లీ పట్టాలెక్కిస్తామని స్పష్టం చేశారు.
ఇదే అంశంపై దుల్కర్ సల్మాన్ స్పందిస్తూ.. “కల్కి తర్వాతి భాగంలో నా పాత్రకు సంబంధించి షూట్ ఉందంటే, ఇప్పటికిప్పుడు నేరుగా సెట్స్‌కు వెళ్లిపోవడానికి నేను సిద్ధం” అంటూ తన అమితమైన ఆసక్తిని బయటపెట్టారు. దర్శకుడు నాగ్ అశ్విన్ వేదికపైకి దర్శకుడు అనుదీప్ కేవీ శైలిలో ఫుల్ ఎనర్జీతో నవ్వులు పూయిస్తూ ఎంట్రీ ఇచ్చారు. “దాదాపు ఏడాది క్రితం దుల్కర్ నిర్మించిన ‘లోకా’ చిత్రానికి సపోర్ట్ చేసేందుకు వచ్చాను, మళ్లీ ఇప్పుడు ఆయన సినిమా వేడుకకు రావడం ఆనందంగా ఉంది. ‘ఐ యామ్ గేమ్’ కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు, ఇందులో ప్రేక్షకులను ఆద్యంతం అలరించే అద్భుతమైన వినోదం (ఫన్) కూడా ఉంది” అని సినిమా విజయంపై నమ్మకం వ్యక్తం చేశారు.
Also Read
తాజావార్తలు
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!