Woman Marries Lord Vishnu : మహా విష్ణువును పెళ్లి చేసుకున్న మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Marries Lord Vishnu : దేవుళ్లను ఆరాధించడం మన సంప్రదాయం. పూర్వం దేవుడి కటాక్షం కోసం చాలామంది కఠినంగా తపస్సులు కూడా చేశారని విన్నాం. ఇప్పటికే దేవుడే తమ లోకంగా భక్తిలో మునిగిపోయే భక్తులున్నారు. మీరా బాయి గుర్తుందా మీకు ఆమె కృష్ణ భగవానుడిపై అమితమైన ప్రేమ పెంచుకున్న ఆమె చివరకు అతడిని పెళ్లి చేసుకుంది. అలాగే రాజస్తాన్ లోని ఓ మహిళ దేవుడిపై తనకున్న భక్తిని ప్రేమగా మార్చుకుంది. ఆ ప్రేమతోనే శ్రీ మహా విష్ణువును డిసెంబర్ 8వ తేదీన సంప్రదాయబద్ధంగా పెళ్లాడింది. ఆమె నిర్ణయం వెనక కారణం తెలిసి చాలామంది ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకు ఆమె ఏం చెప్పిందంటే… ‘చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తలు గొడవపడడం చూశాను. గొడవల కారణంగా వాళ్ల జీవితాలు నాశనం కావడం గమనించాను. అయితే.. ఎక్కువగా నష్టపోయేది మాత్రం ఆడవాళ్లే. అందుకనే నేను విష్ణువును పెళ్లి చేసుకోవాలనుకున్నా’ అని చెప్పింది. ఆ యువతి పేరు పూజా సింగ్. ఆమెది జైపూర్‌లోని నర్సింఘ్‌పూర్ గ్రామం.
Read Also: Delivery In Washroom : ప్రెగ్నెన్సీ అని తెలియకుండానే బిడ్డకి విమానంలో జన్మనిచ్చిన మహిళ
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
జైపూర్‌లోని నర్సింగ్‌పురా గ్రామంలో నివసించే పూజా సింగ్‌కి 30 ఏళ్లు. ఆమె తండ్రి BSF నుండి పదవీ విరమణ పొందారు. ఆయనకు తన కూతురు వివాహం చేసుకోవడం ఇష్టంలేదు. తన వివాహానికి కూడా హాజరు కాలేదు. కానీ ఆమె తల్లి రతన్ కన్వర్ దీనికి మద్దతుగా నిలిచి.. కన్యాదానం చేసింది. దాదాపు 300 మంది కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల సమక్షంలో అధికారిక వివాహ వేడుకలో పూజా సింగ్, మహా విష్ణువు విగ్రహంతో వివాహం జరిగింది. ఇలాంటి పెళ్లికి కుటుంబ సభ్యులను ఒప్పించడం అంత సులువు కాదని, అయితే తాను నిశ్చయించుకున్నానని, చివరికి తన తల్లి మద్దతును పొందానని పూజ తెలిపింది. పండిట్‌తో పూజ తొలుత ఈ రకమైన వివాహం గురించి చర్చించారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఇది సాధ్యమవుతుందని తెలపడంతోనే తాను వివాహం చేసుకున్నట్లు ఆమె తెలిపింది. ఇప్పుడు, వివాహం తర్వాత, దాంతో, పూజ ఇంట్లోనే విష్ణువు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంది. ప్రతిరోజు ఆ విగ్రహానికి పూజలు చేస్తూ గడపనుంది.
తాజావార్తలు
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
-
Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
-
India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..