నందమూరి బాలకృష్ణ హోస్టుగా మారి చేస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలయ్య తనదైన శైలిలో చేస్తున్న టాక్ షోకు ఆహా ఓటీటీలో మంచి రేటింగ్ వస్తోంది. దేశంలోనే నంబర్ వన్ టాక్ షోగా అన్‌స్టాపబుల్ రికార్డు సృష్టించింది. ఐఎండీబీలో కూడా ఈ షో ఏకంగా 9.8 రేటింగ్‌తో దూసుకుపోతుంది. ఇప్పుడు ఈ షో తొలి సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ చివరి ఎపిసోడ్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా రానున్నాడు. ఈ విషయాన్ని ఆహా తన ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
Read Also: అప్పట్లో ఎన్టీఆర్… ఇప్పుడు బాలకృష్ణ
తాజాగా ఈ ముగింపు ఎపిసోడ్ స్ట్రీమింగ్ తేదీని ఆహా ప్రకటించింది. ఫిబ్రవరి నాలుగో తేదీన ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. గతంలోనే ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇటీవల అబ్బాయి తారక్ హోస్టుగా చేసిన ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షో చివరి ఎపిసోడ్‌కు కూడా మహేష్‌బాబే ముఖ్య అతిథిగా వచ్చాడు. ఇప్పుడు బాబాయ్ షోకు కూడా చివరి ఎపిసోడ్ మహేష్‌దే కావడం విశేషం. ఈ ఎపిసోడ్ కోసం నందమూరి అభిమానులతో పాటు సూపర్ స్టార్ అభిమానులు ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే అన్‌స్టాపబుల్ షోలో భాగంగా 9 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అయ్యాయి.